Sunday, December 22, 2024

పోలీసు వ్యాను పేల్చేసిన నక్సల్స్: 10 మంది పోలీసులు, డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలి 10 మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్ మరణించినట్లు అధికారులు తెలిపారు. అరన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. రాష్ట్ర పోలీసులకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డు(డిఆర్‌జి) బృందం బుధవారం ఒక నక్సలైట్ నిరోధక ఆపరేషన్‌లో పాల్గొని మినీ టూడ్సు వ్యానులో తిరిగివస్తుండగా మందుపాతర అమర్చి నక్సలైట్లు దాన్ని పేల్చివేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. నక్సలైట్లు ఐఇడిడి పేలుడు సృష్టించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News