Thursday, January 23, 2025

ఢిల్లీ పూల మార్కెట్‌లో ఐఇడి లభ్యం

- Advertisement -
- Advertisement -

IED found at Delhi Flower Market

బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఘాజీపూర్ పూల మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం ఐఇడి(ఇంప్రువైజ్డె ఎక్స్‌ప్లోసివ్ డివైస్) బాంబు ఉన్న ఒక బ్యాగును పోలీసులు గుర్తించి దాన్ని నిర్వీర్యం చేశారు. ఈనెల 26న దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉదయం 10.19 గంటల ప్రాంతంలో పూల మార్కెట్‌లో ఎవరో వదిలివేసిన బ్యాగు అనుమానాస్పదంగా కనపడినట్లు తమకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వెంటనే ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ సెల్‌అధికారులు, ఎస్‌ఎస్‌జి బాంబు నిపుణుల బృందం, అగ్నిమాపక శకటాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని వారు చెప్పారు. కంట్రోల్డ్ ఎక్స్‌ప్లోజన్ టెక్నిక్‌తో ఐఇడిని నిర్వీరం చేసి ఐఇడి నమూనాలను సేకరించామని ఎన్‌ఎస్‌జి అధికారి ఒకరు తెలిపారు. నమూనాలను విశ్లేషించి నివేదికను ఢిల్లీ పోలీసులకు అందచేస్తామని ఆయన చెప్పారు. నల్ల రంగులో ఉన్న ఆ బ్యాగు 3 కిలోల బరువు ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News