Monday, December 23, 2024

ఘాజీపూర్ పూల మార్కెట్ లో బాంబు కలకలం

- Advertisement -
- Advertisement -

IED found at Delhi Ghazipur flower market

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్ లో శుక్రవారం బాంబు కలకలం రేగింది. ఐఈడీ పదార్థాలతో కూడిని బ్యాగును దుండగులు మార్కెట్ లో వదిలివెళ్లారు. స్థానికుల ఫిర్యాదుతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాంబుస్క్వాడ్, ఎన్ ఎస్ జీకి సమాచారం అందించారు. అంతేకాకుండా ముందుజాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను పిలిపించారు పోలీసులు. బాంబును గుర్తించి ఎన్ఎస్ జీ అధికారులు నిర్జన ప్రదేశంలో పేల్చారు. బాంబును సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాంబు ఎవరు పెట్టారన్న దానిపై విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News