Sunday, December 22, 2024

మీకు 15 నిమిషాలు సరిపోతే… మాకు 15 సెకండ్లు చాలు !

- Advertisement -
- Advertisement -

అక్బరుద్దీన్ ఓవైసీకి నవ్ నీత్ రాణా హెచ్చరిక

హైదరాబాద్: మజ్లీస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ 2013లో చేసిన వ్యాఖ్యానానికి బిజెపి నాయకురాలు నవ్ నీత్ రాణ్ కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో అక్బరుద్దీన్ పోలీసులను 15 నిమిషాల పాటు తప్పించితే 100 కోట్ల మంది హిందువులకు తమ తడాకా ఏమిటో రుచి చూపిస్తామని అన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఆయనకు 15 నిమిషాలు సరిపోతాయేమో కానీ మాకు 15 సెకండ్లు చాలు… ముస్లింల అంతు చూడడానికి అన్నారు.

నవ్ నీత్ రాణా ప్రస్తుతం లోక్ సభకు బిజెపి టికెట్ పైన పోటీ చేస్తున్నారు. బిజెపి అభ్యర్థి మాధవీ లత తరఫున ఆమె హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ హెచ్చరిక చేశారు. మాధవీ లత ప్రస్తుత ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీచేస్తోంది. నవ్ నీత్ రాణా తన ప్రచారంలో మాధవీలతను ‘సివంగి’అని శ్లాఘించారు. ఆమె హైదరాబాద్ ను పాకిస్థాన్ గా మార్చకుండా ఆపగలుగుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడుతుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News