Sunday, January 19, 2025

ఉద్యమిస్తే పిడి కేసులు పెట్టి వేధిస్తారా?

- Advertisement -
- Advertisement -
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : అక్రమ మద్యం షాపులు వద్దని ఉద్యమం చేస్తే పి.డి కేసులు పెట్టి వేధిస్తారా.. అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార గౌడ్ ప్రశ్నించారు. చెన్నూరులో అక్రమ మద్యం, అక్రమ బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఉన్నాయని, అవి చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్క సుమన్ అడదండలతోనే నడుస్తునానయని ఆయన పేర్కొన్నారు. మబడమర్రిలో అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త రుమాండ్ల రాధికతో పాటు పలువురు మహిళలు ఉద్యమం చేశారని, శనివారం రాధిక తోపాటు 11 మంది మహిళలపై అక్రమంగా పి.డి కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని మహేష్ కుమర్ విమర్శించారు. మహిళలకు ప్రభుత్వం .ఇచ్చే గౌరవం.ఇదేనా అని ప్రశ్నించారు. వెంటనే వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి అక్రమ మద్యం షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News