Sunday, January 19, 2025

ఎంవిఎ స్పందిస్తే మహామార్పు: పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో రాజకీయ అధికార మార్పిడి అనేది మహా వికాస్ అఘాదీ(ఎంవిఎ) పార్టీలపైనే ఆధారపడి ఉందని ఎన్‌సిపి నేత శరద్ పవార్ తెలిపారు. తమ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్, శివసేనలు కలిసి ఓ నిర్ణయానికి వస్తే రాష్ట్ర రాజకీయాలలో మార్పు తధ్యం అవుతుందన్నారు. ఇప్పటికప్పుడు ఇక్కడి ప్రభుత్వాన్ని ఎవరికి వారుగా ఏమీ చేయలేకపోవచ్చు అన్నారు. పవార్ సారధ్యపు యశ్వంత్‌రావు చవాన్ ప్రతిష్టాన్ సాయంతో రాజావాడే ఇతిహాస్ సంశోధక మండల్ నుంచి వెలువడ్డ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పవార్ మాట్లాడారు.ఈ కార్యక్రమానికి శివసేన యుబిటి నేత ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరాట్ కూడా హాజరయ్యారు. మూడు పార్టీలు కలిసి పనిచేస్తే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే వీలుందని పవార్ చెప్పడం కీలకం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News