Thursday, January 23, 2025

బిజెపి పాలన వస్తే కరెంట్ ఉద్యోగులు ఇంటికే..

- Advertisement -
- Advertisement -

మెదక్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ రూపొందించిన తెలంగాణ సాధించిన విద్యుత్ ప్రగతి చిత్రాన్ని తిలకించి మంత్రి, ఆ తర్వాత వివిధ రకాల వినియోగదారులతో విద్యుత్ వినియోగంపై వారి అనుభవాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ…. ఒకనాడు ఎండకాలం వచ్చిందంటే ఇన్వర్టర్, జనరేటర్లు తప్ప ఏమి కనిపించేవి కాదని, అప్పుడు రైతుల కష్టం మాటల్లో చెప్పలేనిదన్నారు.

విద్యుత్ రంగం సాధించినెన్నో గొప్ప విజయాలు, అనుభవాలు ఉన్నాయని, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉండి రైతుల కరెంట్ బిల్లు పెంచిముక్కు పిండి బిల్లు వసూలు చేసేవాళ్లన్నారు. అప్పటికే కరువుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు విద్యుత్‌బిల్లు పెంచాడని అప్పుడు ఆ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తప్ప మన కష్టాలు తీరవని గమనించిమన ముఖ్యమంత్రి కెసిఆర్ గులాబీ జెండాను ఎత్తిండన్నారు. పెంచిన కరెంట్ బిల్లుపై ఉద్యమిస్తే బషీర్‌బాగ్ దగ్గర రైతులను కాల్చిచంపిన ప్రభుత్వాలను మనం చూశామన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఓన్ యువర్ ట్రాన్స్‌ఫార్మర్ అనే పథకం కింద రైతులు అప్పుచేసి తమ ట్రాన్స్‌ఫార్మర్లు కొనుక్కునే విధంగా స్కీములు తెచ్చిండని మంత్రి తెలిపారు.

తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే ఉచిత కరెంట్ తప్ప పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కళ్లలోవత్తులు వేసుకుని కరెంట్‌ఎప్పుడు వస్తుందా అని దొంగరాత్రి కరెంటు ఇస్తే రైతులు కరెంట్ షాకులు కొట్టి తేలు, పాములు కుట్టి చనిపోయేవారన్నారు. అప్పటి సిఎం రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని రెండు రోజులు పవర్ హౌస్ సబ్‌స్టేషన్ వద్ద నిరాహర దీక్ష చేసి రెండు రోజులు సబ్‌స్టేషన్ దగ్గరేపడుకున్నామన్నారు. అప్పుడు ఆ ముఖ్యమంత్రిని ఒప్పిం చి 100 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్దిపేటకు తెస్తే ఉమ్మడి మెదక్ జిల్లా జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే సిద్దిపేటకు ట్రాన్స్‌పార్మర్‌లు ఎట్లా ఇస్తారని కొట్లాడిన రోజులుండే అని మంత్రి గుర్తు చేశారు.

ఇప్పుడు మోటార్లు కాలుడు లే దు.ట్రాన్స్‌పార్మర్లు పేలుడు లేదు. పైరవీకారులు అసలే లేరు,లంఛాలు ఇచ్చే పరిస్థితి అంతకంటే లేదు. రైతులకు కావాల్సినన్నీ ట్రాన్స్‌ఫార్మర్‌లు తెలంగాణ రాష్ట్రంలో అం దిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక లాభం పొందని ఒక్క మనిషి కూడా లేడని నేను ఓ సందర్భంలో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాకేమి ఇచ్చారు చెప్పు అని అడిగిండు. అప్పు డు నేను నీకుపొలంకి రైతుబందు వస్తుంది వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమే లాభం కాలేదాఅని అడుగుతే అవుని అని అం గీకరించిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

కరెంటు కష్టాల వల్ల పరిశ్రమలు మూతపడేటివి కార్మికులు ఇబ్బంది పడేవార ని, తినేదానికి తిండిఉండని పరిస్థితి ఉండేది కానీ ఇ ప్పుడు పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల కరెంటు అం దిస్తుంది తెలంగాణ ప్రభుత్వమని మంత్రి తెలిపారు. అ న్నిరంగాలకు అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధ్దిని అ ందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమన్నారు. కేంద్ర బిజెపి వాళ్లు కరెంట్ ప్రైవేటీకరణ చేసి కంపెనీలకు అమ్మి ఉద్యోగాలు ఊడగొడితే సంవత్సరానికి 5వేల కోట్లు ఇస్తామన్నారు. తెలంగాణకు కెసిఆర్ శ్రీరామ రక్ష అన్నారు. కెసిఆర్ కష్టపడి మెదడును కరిగిస్తే ఈ రోజు 24 గంటల నాణ్యమైన కరెంటు ప్రజలకు ఇవ్వగలుగుతున్నామన్నారు.

విద్యుత్ పంపిణీని బలోపేతం చేసేందుకు 39వేల కోట్లను సిఎం కెసిఆర్ వెచ్చించారని, అందుకెనే ఈ రోజు ప్రిడ్జ్‌లు, మోటార్లు కాలిపోవడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే మళ్లీ అదే పాత రోజులు తిరిగి వస్తాయని, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలుతాయని, 24గంటల కరెంట్ బంద్ అవుతుందన్నారు. సమర్థవంతమైన నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉందని, మన చుట్టూఉన్న రాష్ట్రాలు కర్ణాటక,మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు వస్తలేదంటే అక్కడ కెసిఆర్ లాంటి దమ్మున్న నాయకుడు లేడు కాబట్టి ఆ రాష్ట్రాలు అంధకారంలో ఉన్నాయన్నారు. విద్యుత్ ఉద్యోగుల కృషి, కెసిఆర్ పట్టుదల వల్లే ఈ లక్షాన్ని సాదించగలిగామన్నారు.

దేశంలోనే వెలుగుల తెలంగాణగా మారిందన్నారు. పవర్ హాలిడేలు ఇచ్చిన కాంగ్రెస్‌కు శాశ్వతంగా ప్రజలు హాలిడే ప్రకటించారని, విరామం లేకుండా కరెంటు ఇచ్చిన కెసిఆర్‌కు ప్రజలు విరామం లేకుండా పవర్ ఇచ్చారన్నారు. తెలంగాణకి ప రిశ్రమలు తరలిరావడం వల్ల పరిశ్రమలో 20 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. బిసి ఉత్పత్తి కులాల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం అందించబోతుందన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా వి ద్యుత్ విజయోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎ మ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కలెక్టర్ రాజర్షి షా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ వైస్ చై ర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, విద్యుత్ శాఖ జిల్లా అధికారి జానకిరామ్, నాయకులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News