Wednesday, January 22, 2025

లోక్‌సభ ఎన్నిల్లో బిజెపి మరోసారి గెలు పొందితే దేశానికి పెద్ద విపత్తే : డి. రాజా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నిల్లో బిజెపి మరోసారి గెలు పొందితే దేశానికి పెద్ద విపత్తేనని , ఈ విపత్తు నుండి దేశాన్ని కాపాడుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకమని, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు సాధ్యమైనంత త్వరగా సీట్ల సర్దుబాటు ప్రక్రియును పూర్తి చేసుకుని, బిజెపిని ఓడించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. తమిళనాడులో డిఎంకెతో సిపిఐ సంప్రదింపులు మొదలు పెట్టిందని, దేశ వ్యాప్తంగా సిపిఐ సముచిత స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని మగ్ధూం భవన్‌లో మూడ్రోజుల పాటు జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి.

ఈ సమావేశం లో చర్చించిన అంశాలు, తీర్మానాలు తదితర అంశాలను సిపిఐ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ, పండా, డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ లోక్ పక్ష నేత బినాయ్ విశ్వం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఆ ప్రభుత్వ పాలసీలను విమర్శించడం ప్రతిపక్ష హక్కు అని, కానీ మోడీ, బిజెపిలకు ప్రతిపక్షమే ఉండకూడదని భావిస్తోందని ఇటువంటి నియంతృత్వ , ఫాసిస్టు బిజెపిని లోక్ సభ ఎన్నికల్లో గద్దె దించాలని పిలుపునిచ్చారు. రానున్న లోక్ ఎన్నికలకు తాము సన్నద్ధమవు తున్నామని, ఇందులో భాగంగా మణిపూర్ టూ మహారాష్ట్ర, తమిళనాడు టు బిహార్, స్థానిక రాష్ట్ర నాయకత్వానికి సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైంత త్వరగా పూర్తి చేయాని సూచించినట్టు వివరించారు. ఇండియా కూటమి కామన్ ఎన్నికల మ్యానిఫెస్టో ను రూపొందిస్తామని, అదే సమయంలో తమ పార్టీ తరపున మ్యానిఫెస్టోను రూపొందించేందుకు ప్రత్యేక మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నిరుద్యోగం, నిత్వావసర ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీ తారామన్ ప్రవేశపెట్టి ఓట్ ఆన్ అకౌంట్ తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. అయ్యోధలో రామాలయ అంశాన్ని బిజెపి దూకుడాగా ప్రచారం చేస్తోంద న్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో నేరస్తునిగా ఉన్న అధ్వానీకి భారతరత్న ఇచ్చారన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 16న చేపట్టనున్న సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశ్వవిద్యాలయాల్లో డి రిజర్వేషన్స్ ఇవ్వాలని, తీర్మానం చేసినట్టు రాజా వివరించారు.
ఆ ఐదు రాష్ట్రాల ఫలితాలు గుణపాఠం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి నేతలు ఒక గుణపాఠం కావాలని డి.రాజా అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సక్రమంగా సీట్ల సర్దుబాటు జరగలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ అవగాహన కుదిరిందని గుర్తు చేశారు. కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఇతర పార్టీ పట్ల పరస్పర విశ్వాసం ఉండాలని, అవగాహన ఉండాలని సూచించారు.

నితీశ్ కుమార్ కు బిహార్ ప్రజలు గుణపాఠం చెబుతారు
ఇండియా కూటమిని మోసం చేసిన బిహార్ సిఎం నితీష్ కుమార్ కు ఆ రాష్ట్ర ప్రజలు తగిన గుణ పాఠంచెబుతారని డి.రాజా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష మొదటి సమావేశంలో బిజెపికి హఠావో, దేశ్ బచావో అని నినాదం చేసిన నితీష్ కుమార్, ఇండియా కూటమి నుండి తిరిగి ఎన్ కూటమిలోకి వెళ్లారని మండిపడ్డారు. దీనికి నితీష్ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఒక పావుగా ఉపయోగిస్తోందని విమర్శించారు. రాజ్ ఆర్ భవన్ పనిచేస్తున్నాయని, గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని రాజా దుయ్యబట్టారు. బినయ్ విశ్వం మాట్లాడుతూ పార్లమెంట్ వామపక్ష పార్టీ సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ లెప్ట్ పోరాట పటిమ బిజెపికి తెలుసని, అందుకే గత పార్లమెంట్ సమావేశంలో సిపిఐ నుండి ఇద్దరు, సిపిఐ(ఎం) నుండి ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. ప్రజలకు శత్రువుగా మారిన బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ప్రజాస్వామ్య, లౌకిక, వామ పక్ష’ శక్తులు ముందుకు రావాలని కోరారు.

ఒక ముద్దాయికి భారతరత్న ఇచ్చారు : కె.నారాయణ
డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అనేక నియోజకర్గాలు ఉన్నప్పటికీ రాహుల్ లెఫ్ట్ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే కేరళలోలో పోటీచేయడం ఏమిటని ప్రశ్నించారు. బిజెపిని ఓడించేందుకు దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్న నేపథ్యంలో కేరళలో రాహుల్ పోటీ చేయడం ఆరోగ్య వాతావరణం కాదని సూచించారు. ఒక ముద్దాయికి భారతరత్న ఇచ్చారని ఎల్.కె.అద్వానీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 2న హైదరాబాద్ మగ్ధూంభవన్ ప్రారంభమైన సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు,జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు,లోక్ ఎన్నికలపై చర్చించారు.ఈ సమావేశంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త్ కిసాన్ మోర్చా ఈనెల16న చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలని, చిన్న,మధ్య తరహా కౌలు రైతులను గ్రామ సభల ద్వారా జిల్లా గ్రామీణ, జీవనోపాధిగా గుర్తించాలని, డి.రిజర్వేషన్ మార్గదర్శకాలపై తీర్మానం చేశారు.

‘మ్యానిఫెస్టో కమిటీ ’
రానున్న లోక్ ఎన్నికల నేపథ్యంలో సిపిఐ జాతీయ సమితి ‘ఎన్నికల మ్యానిఫెస్టో’కమిటీని ఏర్పాటు చేసింది. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్ కౌర్, డాక్టర్ బి.కె.కంగో, నాగేంద్రనాథ్ ఓజా, జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, రాజ్యసభ సభ్యులు పి.సందోష్ కుమార్ లను కమిటీ సభ్యులుగా నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News