అహ్మదాబాద్: వచ్చే నెల గుజరాత్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సాధిస్తే ఆ రాష్ట్రానికి భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కాగలరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం మీడియాకు చెప్పారు. అమిత్ షా ప్రకటనతో గుజరాత్‌లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది స్పష్టమైంది. గుజరాత్‌లో ఏడోసారి కూడా అధికారాన్ని దక్కించుకునేందుకు బిజెపి కన్నేసింది. భూపేంద్ర పటేల్ 2021 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. అది అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన ఘట్లోడియా నియోజకవర్గం తొలి ఎంఎల్‌ఏ కూడా. ఆ సీటుకు ఆయన్నే మరోసారి నామినేట్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ దీనికి ముందు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గాధ్విని ప్రకటించారన్నది గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంత వరకు ప్రకటించలేదు. గుజరాత్‌లో 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1, 5న రెండు దఫాలుగా ఎన్నికలు జరుగనున్నాయి. కాగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. గుజారాత్‌లో పోటీ ప్రధానంగా ఆప్, బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య ఉండబోతుంది.
బిజెపి మెజారిటీ సాధిస్తే భూపేంద్ర పటేల్ గుజరాత్ సిఎం: అమిత్ షా
- Advertisement -
- Advertisement -
- Advertisement -