Friday, December 20, 2024

తెలంగాణలో బిఆర్‌ఎస్ వస్తే సంక్షేమం.. వాళ్లొస్తే సంక్షోభం

- Advertisement -
- Advertisement -

రెచ్చగొట్టే ప్రసంగాలతో పబ్బం గడుపుతున్న బిజెపి, కాంగ్రెస్ నేతలు
ఎమ్మెల్యే అంజన్నపై మంత్రి ప్రశంసల వర్షం
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ వస్తే సంక్షేమ పథకాలు వరదలా ప్రవహిస్తాయని..కాంగ్రెస్, బిజెపి పార్టీలో వస్తే తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం షాద్‌నగర్‌లో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలో ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ డివిజన్‌లో ఒక్కరేజే సుమారు రూ.170 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు వివరించారు.

దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రజల కోసం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 9ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడంతోపాటు దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కుల, మత, వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని గుర్తు చేశారు. దేశంలో బిజెపి పని అయిపోయిందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల గజ దొంగల మాదిరిగా రాష్ట్రంలోని చొరబడ్డారని, వారిని తరిమి కొట్టే బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో కాంగ్రెస్, బిజెపి నేతలు కాలం వెలదీస్తున్నారే తప్పా చేసిందేమి లేదని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ ఉద్యోగుల నోటిలో మట్టి కోట్టిన ఘనత బిజెపిదేనని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని వివరించారు. కాంగ్రెస్ రాజ్యం అంటే రూ.200 పింఛన్, ఉదయం 3గంటలు, సాయంత్రం 3 గంటల విద్యుత్ వస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. 70 ఏళ్ల పరిపాలనలో 11గురుకుల పాఠశాలలు ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత కరెంటు కాదు మీటర్లు ఏర్పాటు చేస్తారని వాపోయారు.


అంజన్న అభివృద్ధిని చూసే ప్రతిపక్షాల ఆరోపణలు షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాల దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు, ఆరాచకాలను ఎండగడుతుంటే అది చూసి తట్టుకొలేకనే ఆసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంజన్న వెంట ఉమ్మడి జిల్లాలో 14మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులు గోడమీద పిల్లి మాదిరిగా కాకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని, వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పే మాటలకు తలొగ్గకుండా ఉండేందుకు కృషి చేయాలని, వచ్చే 15ఏళ్ళ వరకు బిఆర్‌ఎస్‌దే రాజ్యమని వివరించారు. పార్టీని నమ్ముకొని పని చేయండి..పదవులు వాటంతటికి అవే వస్తాయని గుర్తు చేశారు. నిజాయితీ గల కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు గౌరవిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణి, జడ్పి చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, వైస్ చైర్మన్ ఈట గణేష్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మన్నె కవిత నారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మీనర్సింహ్మరెడ్డితోపాటు ఎంపిపిలు, జడ్పిటిసిలు, సింగిల్ విండో చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News