Saturday, November 23, 2024

బిఎస్పీ అధికారంలోకి వస్తే టిఎస్‌పిఎస్సీ బోర్డును రద్దు చేస్తాం : డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పరీక్షా పేపర్లు లీక్ చేసి,వేల కోట్లకు అమ్ముకొని 35 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన టిఎస్‌పిఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. జూన్ 11న రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్,డివిజన్ బెంచ్ లు ఇచ్చిన తీర్పు టిఎస్‌పిఎస్సీ చైర్మెన్, సభ్యులకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. చైర్మన్ జనార్దన్ రెడ్డిని, సభ్యులను ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం బర్తరఫ్ చేసి,కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి రోజే అవినీతిలో కూరుకుపోయి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ప్రస్తుత బోర్డును రద్దు చేస్తాం. పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగిస్తామని, పేపర్ లీకేజీలకు పాల్పడ్డ చైర్మన్, సభ్యులను, కీలక ఉద్యోగులను విచారించి చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. ప్రతి ఏడాది మెగా డీయస్సీతో సహా రాష్ట్రం లో ఖాళీలు ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పేర్కొన్నారు. పరీక్షలో మాల్ ప్రాక్టిస్ కు పాల్పడ్డ వారిపై నేరాలు రుజువైతే భవిష్యత్తులో సెంట్రల్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయకుండా జీవితకాలం నిషేధం విధిస్తామని హెచ్చరించారు. బోర్డులో ఐపిఎస్, ఐఎఎస్‌లతోపాటు మేధావులు,విద్యావేత్తలు,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని మాత్రమే ఛైర్మెన్,బోర్డు సభ్యులుగా నియమిస్తామని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News