న్యూఢిల్లీ : కేసు ఓడిపోతే… అది న్యాయవాది తప్పు కాదని ఆయన వాదనలో లోపం ఉందనడం సరికాదని, సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల ఓ వ్యక్తి ఒక కేసుకు సంబంధించి ముగ్గురు న్యాయవాదులను నియమించుకున్నారు. ఆ కేసు ఓడిపోవడంతో న్యాయవాదులు సరిగా వాదించలేదంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను కమిషన్ తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు… ప్రతి కేసులో న్యాయాన్ని బట్టి గెలుపోటములు ఉంటాయి. ఓటమిలో న్యాయవాది నిర్లక్ష్యం ఏ మాత్రం ఉండదు. దాన్ని న్యాయవాది వాదనలో లోపం అనలేం అని కోర్టు పేర్కొంది. ప్రతి కేసులో ఎవరో ఒకరు ఓడిపోతారు. అలా ఓడిపోయిన వ్యక్తులు న్యాయవాది సరిగా వాదించలేదని, పరిహారం ప్రకటించాలని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయిస్తున్నారని కోర్టు తెలిపింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, న్యాయవాదుల వాదనలో లోపాలు ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుందని జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది.