Wednesday, January 8, 2025

సిఎం రేవంత్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తే, రాజకీయాలను నుంచి తప్పుకుంటా

- Advertisement -
- Advertisement -

రామాయం పేట విజయ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్

మన తెలంగాణ / హైదరాబాద్: రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అని బిజెపి నాయకులు ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. సఫాయి కార్మికుల, వైద్య సిబ్బంది కాళ్ళు కడిగి కరోనా సమయంలో చేసిన సేవను గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. కేంద్రం ఇస్తే తప్ప ఇళ్లు కట్టలేడు రేవంత్ రెడ్డి, పెన్షన్ ఇవ్వలేడు, జీతాలు ఇవ్వలేడు.. అందుకే వాళ్లకు ఓట్లు వేసి మనం అడుక్కోవడం ఎందుకు మనకే ఓట్లు వేసుకుందాం… అన్నీ తెచ్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రామాయం పేటలోని రాజరాజేశ్వరి క్లస్టర్‌లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా మోడీ చేసిన పనులు చెప్పి మీ ఓటు అడిగేందుకు వచ్చామన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలు, అమలుచేయడంలో విఫలం అయ్యారన్నారు.

నిరుద్యోగభృతి ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తాం, పెన్షన్‌లు ఇస్తాం వంటి హామీలు నెరవేర్చక పోగా కనీసం వేతనాలు కూడా సరిగా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ‘నాకు ఓటు వేయండి’ అని రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారన్నారు. ‘నాలుగు వేల పెన్షన్ ఇస్తా, వికలాంగులకు 6 వేలు, ప్రతి ఆడబిడ్డకు రూ ,2500లు అందచేస్తా, రైతులకు రూ,2 లక్షల రుణమాఫీ చేస్తా’ అని సిఎం రేవంత్ బూటకపు హమీలు ఇచ్చారని ఆయన ఆరోపించారు.మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీలేని రుణాలు, 15 వేల రైతుబంధు, 12 వేల కౌలు బంధు, వారికి 500 రూ. బోనస్ ఇలా అనేక హామీలు ఇచ్చారని, కానీ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కెసిఆర్ కంటే ఎక్కువ అబాద్దాలు చెప్పింది సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘మోడీ వచ్చాక.. జమ్మూ కాశ్మీర్ లో బుల్లెట్ గాయాలు లేవు, దేశంలో మతకలహాలు లేవు, బాంబుల మోతలు లేవన్నారు. భారత దేశానికి వచ్చిన గుర్తింపుకు కారణం నరేంద్ర మోడీ’ అని అందుకే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం, మళ్ళీ  మోడీని ప్రధానిని చేసుకుందామని పిలుపు నిచ్చారు. ఎరువుల మీద సంవత్సరానికి ఎకరానికి 18 వేల రూపాయల సబ్సిడీ ప్రధాని అందిస్తున్నారని, రూ.6300 కోట్లతో రామగుండం కర్మాగారం తెరిచి ఎరువుల కోసం లైన్లు కట్టే బాధ తప్పించారన్నారు.ఈ కార్యక్రమంలో బోడిగ శోభ, రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News