Monday, December 23, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి ప్రాధాన్యత విద్యకే

- Advertisement -
- Advertisement -
నాలుగు నెలల్లో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వేయాలి
లేకపోతే ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తాం

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరు సిఎంగా ఉన్నా తమ మొదటి ప్రాధాన్యత విద్యపై ఉంటుందని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం కొనసాగే ఈ నాలుగు నెలల్లో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ రాకపోతే వచ్చే కాంగ్రెస్ పాలనలో నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను హామీ ఇచ్చినట్లు నోటిఫికేషన్ రాకపోతే తెలంగాణ కోసం రాజీనామా చేసినట్టుగానే నిరుద్యోగుల కోసం మరోసారి రాజీనామా చేస్తానని ఎంపి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ఆయన్ను టిఆర్టీ అభ్యర్థులు వెళ్లి కలిశారు. ఏళ్లు గడుస్తున్నా టిఆర్టీని చేపట్టడం లేదని అభ్యర్థులు ఎంపికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి ఓట్ల కోసం స్కీంల పేరుతో మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధలు పట్టదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నోటిఫికేషన్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తామని పేర్కొన్నారు. 48గంటల దీక్ష చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని ఎంపి స్పష్టం చేశారు.

F

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News