Monday, December 23, 2024

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే…

- Advertisement -
- Advertisement -

యువత నక్సలైట్‌లుగా మారే ప్రమాదం ఉంది
30 లక్షల మంది నిరుద్యోగులు పోరాడి అలసిపోయారు
విజయభేరి సభలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఉద్యోగాలు రాని యువత అడవిలో అన్నలుగా మారే ప్రమాదం ఉందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు పోరాడి అలసిపోయారన్నారు.  కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో మంగళవారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత అడవిలో అన్నలుగా మారడానికి ప్రస్తుతం ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ లేదన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు సైతం భరోసా ఇస్తామని, ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు.

2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని తాము అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని సర్పంచ్‌లంతా ఆలోచన చేయాలని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపడితే వాటి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News