Sunday, January 19, 2025

కాంగ్రెస్ గెలిస్తే అధోగతే

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ గెలిస్తే అధోగతేనని బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండలో ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్ రెడ్డితో బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా బృందం వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఎన్నికల సమయంలో తమ బృందంతో ఆస్ట్రేలియా నుంచి తెలంగాణకు వచ్చి బిఆర్‌ఎస్‌కు మద్ధతుగా ప్రచారం చేస్తున్నామని కాసర్ల తెలిపారు.

అందులో భాగంగానే నేడు నల్గొండలో గడప గడపకు కెసిఆర్ చేపట్టిన అభివృద్ది సంక్షేమం గురించి వివరిస్తూ కెసిఆర్‌ను మూడో సారి గెలిపించాలని కోరుతున్నామన్నారు. విక్టోరియా ఇంఛార్జి సాయిరాం ఉప్పు మాట్లాడుతూ తెలంగాణను సర్వతముఖాభివృద్ధి చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని, లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భరత్ సింహారెడ్డి, కార్తీక్ గౌడ్ , కత్తుల వినోద్ , సునీల్, శ్రేవేకర్, వీరేందర్, దినేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News