Tuesday, January 21, 2025

పోటీ చేస్తే బిఆర్‌ఎస్ నుంచి మాత్రమే

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం : రాజధాని హైదరాబాద్‌కు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం అన్ని రకాల వనరులతో సమృద్ధిగా ఉందని, ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని, ఈ ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ స్థాయికి ఎదిగానని పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని గడల శ్రీనివాస్ అన్నారు. తన రాజకీయ అరంగ్రేటంపై స్థానిక పాత్రికేయుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జనహిత ప్రాంగణంలో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు.

తన తండ్రి సూర్యనారాయణ ఐదు దశాబ్దాల పాటు వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. ఏన్కూరు రెసిడెన్షియల్ స్కూల్‌లో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి, ఖమ్మం శారద జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి ఎంబిబిఎస్, ఎండి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్లు వివరించారు. గత 20 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో కీలక పదవులు నిర్వహించి ఈ స్థాయికి చేరుకున్నట్లు వివరించారు. కరోనా కల్లోలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి సిబ్బంది సహకారంతో అహర్నిషలు కష్టపడి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించకుండా కాపాడినట్లు తెలిపారు.

దురదృష్టవశాత్తు తండ్రిని మాత్రం ఈ వైరస బారి నుండి రక్షించుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ జిఎస్‌ఆర్ ట్రస్ట్ స్థాపించి విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సేవలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఈ ప్రాంత ప్రజలు తనను సొంత బిడ్డగా ఆదరిం చి అక్కున చేర్చుకున్నారని వారికి మరి న్ని సౌకర్యాలు కల్పించేందుకు ఉన్నత ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా త్యుజించి ప్రజాప్రతినిధిగా వారి కష్టాల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

తాను పోటీ చేస్తే కొత్తగూడెం అందునా బిఆర్‌ఎస్ నుంచి మాత్రమే బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు ప్రజల దీవెనలు తనకు ఉన్నాయని ఖచ్చితంగా తాను అనుకున్న లక్షాన్ని చేరుకుంటానని గడల దీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు ఉంటే సరిపోదని సామాజిక సృహ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అయితే సీఎం వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు ఇస్తామని చేసిన ప్రకటనను పాత్రికేయులు ఆయన దృష్టికి తీసుకురాగా తన ప్రయత్నం తాను చేస్తానని ఒక వేళ పరిస్థితులు అనుకూలించక పోతే తిరిగి ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తేల్చి చెప్పారు.

వినూత్న ‘కొత్త’గూడెం నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తనపై నమ్మకంతో ముం దుకు సాగేందుకు సిద్ధం గా ఉన్నవారు 8019767675 నెంబర్‌కు మిస్‌కాల్ ఇవ్వాలని సూచించా రు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందించే వారు లేఖ రూపంలో జనహిత చిరునామాకు లేఖ రాయాలని మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News