Monday, December 23, 2024

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు తిరగబడుతారు

- Advertisement -
- Advertisement -
  • కాంగ్రెస్, బిజెపిలకు ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరిక

గజ్వేల్: సిఎం కెసిఆర్ సారధ్యంలో సంక్షేమం, అభివృద్దిని అన్ని వర్గాలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని , తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో కాంగ్రెస్, బిజెపిలు తమ ఉనికిని కోల్పోతున్నాయని ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సారధ్యంలో సాగిన తెంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాలు సమష్టిగా కలిసి వచ్చి పోరాడిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని , ఇది ఎవరి బిక్ష కాదని ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది,సంక్షే కార్యక్రమాల పరంపరతో దిక్కుతోచని స్థితిలో పడ్డ కాంగ్రెస్ బిజెపి పార్టీలు సిఎం కెసిఆర్‌పై తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేనే లేదన్నారు.

కాంగ్రెస్ హయాంలో మంత్రి గీతారెడ్డిలాంటి వారు ప్రాతినిధ్‌యం వహించినప్పటికీ కనీసం గజ్వేల్ =ప్రజ్ఞాపూర్ మధ్య ఒక వంతెన నిర్మించ లేకపోయారని, పట్టణంలో రోడ్లు వేయించలేక పోయారని ఆయన నిశితంగా విమర్శించారు, కంకర తేలిన రోడ్లతో గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలు అరకొరగా ఉండేవని ఇవన్నీ విజ్ఞులైన ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో కాళ్ళకల్,తదితర చోట్ల సెజ్‌ల కోసం భూములను తీసుకున్న పాలకులు రైతులకు, నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం కానీ ప్రత్యామ్నాయం కానీ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి హరీష్ రావు చొరవతో ఆ ప్రాంత రైతులకు 425 మందికి ప్లాట్టు ఇచ్చామన్నారు.

ఇప్పుడు వర్గల్ పరిసర ప్రాంతంలో పరిశ్రమలు స్థాపపపపపించి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేయాలని సిఎం కెసిఆర్ చేసిన ప్రయత్నాలపై అభివృద్ది నిరోధకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు కోర్టుద్వారా అడ్డుకునే కుట్రలకు దిగుతున్నారని ఎఫ్‌డిస్ ఛైర్మన్ ప్రతాపరెడ్డి ఘాటుగా విమర్శించారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను దగా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలేనని, రైతులకు ఎరువులు, విత్తనాలు దొరకక రోడ్లపై పడిగాపులు కాచిన చెడ్డ రోజులను ఇప్పటికీ రైతలు మరచిపోలేదన్నారు. విద్యుత్ సరఫరా లేక బోర్లు పనిచేయక పోయి ఎండిపోయిన పొలాల వద్ద ఉసురు తీసుకున్న రైతుల మృత్యుఘోష ఇప్పటికీ బాధిత కుటుంబాలు మరవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీటిని అందిచటంతో పాటు అన్ని చెరువులను నింపి ఎండాకాలంలో సైతం మత్తడి దునికే విధంగా జలకళను తలపిస్తున్న నీటివనరులతో పచ్చని పంటపొలాలతో కనువిందు చేస్తున్నాయన్నారు. భూగర్భ జలాల నీటిమట్టం పెరిగి పంటలు గణనీయంగా పండుతున్నాయన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భరోసాతో అందిస్తున్న సాయంతో అధికంగా పంటలు పండుతున్న నేపధ్యంలో ఒక గజ్వేల్ పరిధిలోనే 35లక్షల కింటాళ్ల వరిధాన్యం పండించారన్నారు.

కాంగ్రెస్ , బిజెపిలకు ప్రజల ముందుకు వెళ్లి చెప్పుకోవటానికి ఏం మిగిలిందన్నారు. అనవసరంగా సిఎం కెసిఆర్‌ను తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణ లు చేస్తే ప్రజలు ఆ పార్టీలను తరిమి కొడతారని ప్రతాపరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎఎంసి ఛై ర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, ఎంపిపి దాసరి అమరావతి శ్యాంమనోహర్, జడ్పీటిసి పంగమల్లేశం, రాష్ట్ర రైతు బందు రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీ రవీందర్,మున్సిపల్ వైస్ ఛైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్లు బబ్బూరి రజితా గౌడ్,బొగ్గుల చందు, రహీం, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బెండె మధు ,ఎంపిపి వైస్ క్రిష్ణా గౌడ్, నాయకులు స్వామి, గుంటుకు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News