Saturday, December 21, 2024

ఇసి అనుమతిస్తే… వారంలో రుణ మాఫీ పూర్తి

- Advertisement -
- Advertisement -

లేదంటే ఎన్నికలు ముగిసిన మరునాడే మిగిలిన వారందరికీ మాఫీ చేస్తాం

బిఆర్‌ఎస్ సంక్షేమం తీసుకొస్తే.. కాంగ్రెస్ కత్తులు దూస్తోంది

పార్టీల చరిత్రను చూసి ఓటేయ్యండి

నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/నిర్మల్ ప్రతినిధి: అన్నదాతలను ఆదుకోవడానికే రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రకటించామని, అయితే ఇంకా కొందరి రుణాలు మాఫీ కావాల్సి ఉందని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తెలియజేశారు. పనీపాటలేని కొంతమంది కాంగ్రెస్ నాయకులు రుణమాఫీని అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే వారం, పదిరోజుల్లో మిగిలిన వారికి కూడా రుణమాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు. కాదంటే.. ఎన్నికలు ముగిసిన మరునాడే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కో సం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ముందు కు సాగితే అది ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నాయకు లు కత్తులతో దాడి చేస్తున్నారని, వజ్రాయుధంలాంటి ఓటు ఎంతో విలువైందని, పార్టీల చరిత్రల ను చూసి నాయకులకు ఓటు వేయాలని సిఎం అ న్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో మంత్రి, బిఆర్‌ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన భారీ బహిరంగ సభ, ప్రజా ఆశీర్వాద సభకు సిఎం కెసిఆర్ ముఖ్య అతిథీగా హాజ రై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎన్నికలు వస్తూ పోతాయాని సంక్షేమ పాలన అందించే వారిని గుర్తించి ఓటు వేయాలన్నారు. పార్టీల చరిత్రను చూసి ఓటు వేయాలన్నా రు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని బిఆర్‌ఎస్ పార్టీ పదేళ్లలో చేసి చూపించిందన్నారు. చావు నోట్లే తలపెట్టి తెలంగాణను సాధించుకున్నామని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు తెలంగాణ పరిస్థితి అవుతుందన్నారు.

తెలంగాణ రాకపోతే నిర్మ ల్ జిల్లా అయ్యేదా… సువిశాలమైన పాలన అందే దా అన్నారు. జిల్లాల విభజన చేసేటప్పుడే నాతో గంట పాటు పోరాడి, చర్చించి నిర్మల్ జిల్లాను సా ధించిన కీర్తి ఇంద్రకరణ్ రెడ్డికే దక్కుతుందన్నారు. నేడు నిర్మల్ జిల్లాగా చేసుకొని జరుగుతున్న అభివృద్ధ్ది ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందన్నారు. అ లాగే రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ నాయకు లు రైతుబంధు వద్దనడం, రైతులకు 24 గంటల కరెంట్ కాకుండా కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందంటున్నారని అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అలాగే నేడు ధరణి తీసుకొచ్చి రైతులకు భరోసాను ఇచ్చామని ధరణిని ఎత్తివేసి మళ్లీ పాత పద్ధతికి వస్తే విఆర్‌ఒలు, ఎమ్మార్వోల లంచాల పాలన మొదలవుతుందన్నారు.

నిర్మల్‌లో ఇది వరకే మెడికల్ కళాశాల మంజూరు చేశామని, ఇంద్రకరణ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తే నిర్మల్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేడు దళితులు సమాజంలో అణిచివేయబడి ఉన్నారని, అంటరానితనం అనే వివక్షకు గురవుతూ అభివృద్ధిని నోచుకోకపోతే బిఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. నెహ్రు నుంచే దళిత సంక్షేమంపై దృష్టి పెట్టి ఉంటే దళితుల పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ముస్లింలకు విద్యను అందిస్తున్నామని, కెసిఆర్ ప్రాణాలతో ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గానే ఉంటుందని తెలిపారు. నేను చెప్పిన మాటలు ఇక్కడే వదిలేయకుండా ఇంటికెళ్లి గ్రామాలల్లో, బస్తీలల్లో, గల్లీలలో చర్చించాలన్నారు. సంక్షేమ పథకాలతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం దూసుకెళ్తుంటే అది ఓర్వలేని కాంగ్రెస్ వాళ్లు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికలు అనగానే ఆగమై గతంలో మంచి చేసిన బిఆర్‌ఎస్ పార్టీని మరువద్దన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలిస్తే మీకు లాభం జరుగుతుందన్నారు.

గతంలో అన్నదాత రుణాల బకాయిలు ఉంటే రైతుల ఇండ్ల తలుపులు గుంజుకపోయేవారన్నారు. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి బీమా చేయాలని నిర్ణయించామన్నారు. అర్హులైన మహిళలకు నెలకు రూ. 3వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ కొత్త మేనిఫెస్టో మీ ముందు ఉంది. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త వాటికి శ్రీకారం చుడుతామన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పథకాలన్నీ ఆగమౌవుతాయన్నారు. వజ్రాయుధం లాంటి ఓటు మీ చేతిలో ఉంది దానిని సక్రమంగా వినియోగించుకొని సంక్షేమ పాలన అందించే నాయకులనే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఖానాపూర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి భుక్య జాన్సన్ నాయక్, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్ ,మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారీ, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మీ, నాయకులు సత్యనారాయణగౌడ్, ఎంపీపీ కోరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జీ. ఈశ్వర్, మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక రమణ , నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు , నాయకులు, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News