Thursday, December 26, 2024

అనుమతి లేకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే ప్రత్యక్ష దాడులు చేస్తాం

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్ : అనుమతి లేకుండా విద్యాసంస్థలు నిర్వహిస్తే ప్రత్యక్ష దాడులు చేస్తామని ఎఐఎఫ్డిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున అన్నారు.గురువారం నగరంలోని ఓంకార్ భవన్ అండర్ బ్రిడ్జి వద్ద అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఫ్‌డి ఎస్) ముఖ్య కార్యకర్తల సమావేశం గాయి రామ్ మోహన్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గడ్డం నాగార్జున హాజరై మాట్లాడారు. అనుమతి లేని పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరిక చేశారు.

కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో బుక్స్ స్టాల్స్ ని నియంతించాలని వారు విద్యాశాఖను కోరారు, ఫీజు నియంత్రణ కమిటీ వేసి అదిక ఫీజులను అరికట్టాలని వారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ అందించి నాణ్యమైన విద్యను బోధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థలు అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్య హక్కు చట్టప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని, అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇచ్చే విధంగా జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ ఉపాధ్యాయ నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు అన్నారు. లేనియెడల అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర కోశాధికారి పోతుగంటి కాశి ,పిట్టల సాయికుమార్, మోహన్ సాయి భాను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News