Friday, November 22, 2024

ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నికైతే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం: యశ్వంత్ సిన్హా

- Advertisement -
- Advertisement -

 

Yashwant Sinha

శ్రీనగర్: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆయన జులై 18న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో నేడు జమ్మూకశ్మీర్‌ను సందర్శించారు. “ఒకవేళ నేను రాష్ట్రపతిగా ఎన్నికైతే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. పైగా ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థాపించాలని అర్థిస్తాను”అన్నారు.
ఈ సందర్భంగా ఆయన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫారూఖ్ అబ్దుల్లా, మెహబూబాలను ప్రశంసించారు. “నేడు ఇక్కడ మనకు కావలసిన వారంతా హాజరయ్యారు. ఫారూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సయీద్‌జీలు కూడా ఉన్నారు. ఒకవేళ వీరు దేశభక్తులు కాకుంటే మనము కూడా దేశభక్తులమని చెప్పుకోడానికి అర్హులము కాము” అని ఆయన గట్టిగా చెప్పారు. ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల తేదీని జులై 16గా ఖరారు చేసింది. ఓట్ల లెక్కింపు జులై 18న జరుగుతాయి. మొత్తం ఎంపీలు, ఎంఎల్‌ఏలు కలుపుకుని 4809 మంది ఎలక్టర్లు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం జులై 24తో ముగియనుంది. కాగా కొత్త రాష్ట్రపతి పదవి జులై 25 నుంచి అమలులోకి రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News