Thursday, January 23, 2025

నేరం చేస్తే, శిక్ష అనుభవించాల్సిందే : మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

Mamata Benerjee

కోల్ కతా: ‘ఎవరైనా తప్పంటూ చేస్తే దానికి శిక్ష అనుభవించాల్సిందే’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తన మంత్రివర్గం మంత్రి పార్థ ఛటర్జీ స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్ సి) కుంభకోణంలో అరెస్టు కావడంపై ఆమె ప్రతిస్పందించారు. ఆమె ఓ రాష్ట్ర అవార్డు వేడుకలో ఆమె ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. ‘‘నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. ఎవరైనా నేరం చేసినట్లు రుజువైతే తప్పక శిక్ష అనుభవించాల్సిందే. మా పార్టీ కూడా తగిన చర్య తీసుకుంటుంది. కానీ ఈ విషయంలో నా మీద జరుగుతున్న దుష్ప్రచారంను నేను ఖండిస్తున్నాను’అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

22 కోట్ల రూపాయల నగదు దొరికిన అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు ఆమెతో ఎలాంటి సంబంధాలు లేవని బిజెపి షేర్ చేసిన వీడియోను ఆమె ప్రస్తావిస్తూ తెలిపారు. ఆ వీడియోలో అర్పితా ముఖర్జీతో సంభాషించడాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ‘ఎవరైనా నాతో ఫోటో దిగినంత మాత్రాన అది నా తప్పు కాదు’ అన్నారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తృణమూల్ కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే అది తప్పే కాగలదు’ అంటూ ఆమె బిజెపిని ఉద్దేశించి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News