Monday, January 20, 2025

గ్రూప్-2 వాయిదా వేయకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిస్తాం: టి పిసిసి

- Advertisement -
- Advertisement -

విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచన టిఎస్‌పిఎస్‌సికి లేదని విమర్శ

హైదరాబాద్ : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని టి పిసిసి హెచ్చరించింది. గ్రూప్-2 వాయిదా వేయాలని 6 లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కారని, వారు పరీక్ష వద్దని అనడం లేదు కానీ కేవలం వాయిదా వేయమని కోరుతున్నారని టీ పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. టీ పీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ తదితరులతో కలిసి శనివారం గాంధీ భవన్‌లో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, అటు టిఎస్‌పిఎస్‌సి కూడా మొత్తం కుళ్ళిపోయిందని విమర్శించారు. గ్రూప్-2 వాయిదాపై మూడు రోజుల క్రితం నిరసన వ్యక్తం చేశామని, టిఎస్‌సిఎస్‌సికి రెండు రోజుల సమయం ఇచ్చామని, అయినా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఒక వేళ ఇప్పుడు వాయిదా వేస్తే.. మరో రెండు నెలలు వరకు పరీక్ష పెట్టడం కుదరదు అంటూ టీఏస్‌పీఏస్సీ అధికారులతో లీక్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు.

అసలు ఆఫ్ లైన్‌లో రాసే ఎగ్జామ్‌కి సెంటర్‌ల సమస్య ఎందుకు వస్తుందో బోర్డ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తాము ప్రెస్ మీట్ పెడితే అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. అసలు టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు ఎందుకు బయపడుతున్నారని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.అనంతరం టీ పీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ మాట్లాడుతూ అసలు విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచన టిఎస్‌పిఎస్‌సికి లేదని విమర్శించింది. పేపర్ లీక్‌లు గందరగోళం మధ్యే పరిక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ఇతర పరిక్షలు నిర్వహించే బోర్డులకు, టిఎస్‌పిఎస్‌సి కి మధ్య సమన్యాయం లేదన్నారు. ఈ క్రమంలో గ్రూప్-2 పరిక్ష వాయిదా వేయమని కోరినా ససేమిరా అంటుంన్నారన్నారు. విద్యార్థులకు మద్దతు ఇస్తుంటే తామోదో రెచ్చగొడుతున్నామని అపోహలు సృష్టిస్తున్నారన్నారు.

మొన్న మఫ్టిలో వచ్చి పోలీసులు అరెస్టు చేశారని, తమ పార్టీ పెద్దలు ఓత్తిడి చేస్తే విడుదల చేశారన్నారు. గ్రూప్ 2 పరిక్ష ఆఫ్ లైన్ ఎగ్జామ్‌పై వారు స్పందిస్తూ 25 వేల అప్లికేషన్‌లు దాటితే ఆన్ లైన్ ఎగ్జామ్ పెట్టడం కుదరదని, అయితే ఓకే రోజు రెండు ఎగ్జామ్స్ ఉండడమే కాకుండా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల గ్రూప్ 2 ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారన్నారు. గ్రూప్-1 ఎగ్జామ్ పేపర్ లీక్ వల్లే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని ఆదరా భాధారాగా పెడుతున్నారని రియాజ్ విమర్శించారు. కాగా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ సత్యాగ్రహ దీక్షను చేస్తున్న ప్రొఫెసర్ కోదండారామ్‌ను , మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ మల్లు రవిలను హౌస్ అరెస్టు చేయడం సరికాదని, వారిని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News