Monday, December 23, 2024

కరెంటు అడిగితే కాల్చి చంపారు

- Advertisement -
- Advertisement -

* తెలంగాణ రాక ముందు చిమ్మ చీకటిలో రాష్ట్రం
* రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ : సమైక్య రాష్ట్రంలో వ్యవసాయానికి సక్రమంగా కరెం టు ఇవ్వాలని ఆందోళన చేస్తే అప్పటి ప్రభుత్వం కర్కశంగా రైతులను కాల్చి చంపిందని రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు కరెంటు కష్టాలకు పూర్తిగా పరిష్కారం చూపించిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గ్రామాలకు సాగునీరు, వి ద్యుత్ ఇచ్చినట్లయితే గ్రామాలు బతికి పోతాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశా బ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం భూ త్పూర్ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడు తూ గ్రామాలు అభివృద్ధ్ది చెందాలంటే పూర్తిగా వ్యవసాయంపైన ఆధారపడి ఉంటాయని, అందువల్ల రైతులకు నీళ్లు, విద్యుత్ ఇస్తే బతికి పోతారని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు ఏ విధంగా మేలు చేయాలో ఆలోచించలేదని, చెక్ డ్యాంలు, చెరువులు , కాలువలు ఎలా నింపాలో చర్యలు తీ సుకోలేదన్నారు. బోర్లు పడక, నీళ్లు లేక విద్యుత్ లేక ఉన్న పొలాన్ని అమ్ముకొని రైతులు వలస వెళ్లి బీడు భూములు, అప్పులతో అల్లాడిపోయారన్నా రు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కర్వెన వంటి రిజర్వాయర్లను నిర్మించామన్నారు. 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు నీళ్లు, విద్యు త్ ఇచ్చి ఉంటే రైతులు వలస వెళ్లేవారు కాదని అన్నారు. విద్యుత్తు, సాగునీటితో పరిశ్రమలు వస్తున్నాయని, ఇతర రంగాలు అభివృద్ధ్ది చెందుతున్నాయని, తెలంగాణ బతుకుతెరువు కల్పించిందని, అందరికీ అన్నం పెట్టిందని తెలిపారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ , జిల్లా మత్సకారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, పిఏసిఎస్ అధ్యక్షులు ఆశోక్‌రెడ్డి, ఎంపిపి శేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ రాంమూర్తి, డిఈ చంద్రమౌళి,, సర్పంచ్ పద్మజ, డిఆర్‌డిఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ , తహసీల్దార్ చెన్న కిష్టన్న, ఎంపిడిఒ మున్నీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News