Friday, November 22, 2024

మళ్లీ గెలిచి.. ప్రజాసేవకు పునరంకితమవుతా

- Advertisement -
- Advertisement -
  • అభివృద్ధి చూడలేని కళ్లున్న కబోదులు ప్రతిపక్షాలు
  • అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు
  • సిఎం కెసిఆర్, కెటిఆర్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు
  • విప్ దాస్యం వినయ్‌భాస్కర్

హన్మకొండ ప్రతినిధి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ గెలిచి ప్రజా సేవకు పునరంకితం అవుతానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఆర్‌ఎస్ నుంచి దాస్యం వినయ్‌భాస్కర్ పేరును ప్రకటించిన సీఎం కేసీఆర్, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మంగళవారం హన్మకొండలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. 2005 నుంచి నాటి టీఆర్‌ఎస్, నేటి బీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కల్గిన కార్యకర్తగా పనిచేస్తున్నాను. నాడు కార్పొరేటర్‌గా పార్టీ బీ ఫాం ఇస్తే గెలిచి వచ్చాను. అనంతరం నగర అధ్యక్షుడిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాను. 2009 ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ నిలిపితే గెలిచి ఉద్యమ సమయంలో కొట్లాడాను. తెలంగాణ వచ్చాకా 2014, 2018 పార్టీ అభ్యర్తిగా అవకాశం, నియోజకవర్గ ప్రజలు, గులాబి శ్రేణుల కృషితో గెలుపొందాను. రానున్న రోజుల్లో అందరిని కలుపుకొని వెళ్తూ మళ్లీ గెలిచి నియోజకవర్గ ప్రజల సేవకు పునరంకితమవుతా. నాతో ఇన్నాళ్లు అండగా నిలిచిన గులాబి శ్రేణులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు రుణ విముక్తి కమిషన్ ఛైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా ఛైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, గ్రంథాలయ ఛైర్మన్ అజీజ్‌ఖాన్, మాజీ కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News