Tuesday, January 7, 2025

సిఎంగా గెలిస్తే…అమూల్ పాలను కొనొద్దంటా: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన డెయిరీ కోఆపరేటివ్ ‘అమూల్’తో కర్నాటకకు చెందిన ‘నందిని’ని కలిపేసే ప్రసక్తేలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు. తాను ముఖ్యమంత్రిని అయితే మాత్రం కర్నాటక ప్రజలను అమూల్ పాలను కొనొద్దని కోరతానన్నారు. ‘అమూల్ ఇప్పుడున్న వినియోగదారుల మేరకే ఉండాలి. కర్నాటకలో ప్రవేశించి స్థానిక రైతులకు అన్యాయం చేయాలనుకుంటోంది. అందుకనే మేము అమూల్ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నాం. నేను ముఖ్యమంత్రిని అయితే మాత్రం అమూల్ పాలను కొనొద్దని ప్రజలను కోరతాను’ అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శనివారం ఆయన ‘ఇండియా టుడే రౌండ్ టేబుల్ 2023’ లో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. ‘ప్రతిపక్షాలది యాంటీమార్కెట్ వైఖరి కాదని, కాకపోతే కృత్రిమ డిమాండ్‌ను సృష్టించడం మంచిది కాదు’అని ఆయన అన్నారు. క్వాలిటీ పరంగా చూసినప్పుడు నందిని పాలు, అమూల్ పాల నాణ్యతకు ఏమాత్రమూ తీసిపోదన్నారు.

గుజరాత్‌కు చెందిన డెయిరీ కోఆపరేటివ్ అమూల్, కర్నాటకలోకి ప్రవేశిస్తున్నట్లు ఏప్రిల్ 5న ప్రకటించింది. కర్నాటకలో పాలు, పెరుగు సప్లయ్ చేస్తోంది. ‘అమూల్’, ‘నందిని’ రెండు బ్రాండ్లు డెయిరీ రంగంలో అద్భుతాలు చేయగలవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న కొన్ని రోజులకే ఈ ప్రకటన వచ్చింది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, జెడి(ఎస్) దాంతో బిజెపిపై విమర్శలు గుప్పించాయి. రూ. 21000 కోట్ల బ్రాండయిన నందినిని, గుజరాత్‌కు చెందిన ‘అమూల్’లో కలిపేసే ప్రమాదం ఉందని వ్యతిరేకించాయి. కర్నాటక ప్రజలకు ‘నందిని’ బ్రాండ్ పాలతో భావోద్వేగ అనుబంధం ఉంది.

Rahul Gandhi buys Nandini icecream

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News