Sunday, December 22, 2024

అదుపు తప్పితే అంతే

- Advertisement -
- Advertisement -
  • మరమ్మతు నోచుకుని రోడ్డు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఝరాసంగం: గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వానంగా తయారు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు నాయకులకు గ్రామ ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. పూర్తి వివరాలకు వెళితే ఝరసంగం మండల పరిధిలోని జునేగావ్ గ్రామంలో 2020 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్ మాసంలో భారీ వర్షానికి సిసి రోడ్డు క్రింది మట్టి కొట్టుకపోయింది. ఈ రోడ్డు మార్గాన వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి గ్రామస్తులు, వాహనదారులు వస్తుంటారు. ఈ రోడ్డు మార్గాన వెళ్లాలంటే వాహనదారులు హడలిపోతున్నారు.

భారీ వర్షానికి సిసి రోడ్డు క్రింది మట్టి కొట్టకపోయినప్పుడు, మంత్రి హరీష్ రావు, ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు సైతం పర్యవేక్షించారు. నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రోడ్డు మరమ్మత్తులు నోచుకోలేదని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ రోడ్డు మార్గాన ప్రయాణించే వాహనదారులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News