ప్రధాని మోడీపై అకాలీదళ్ తొలి దాడి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై శిరోమణి అకాలీ దళ్ (బాదల్) విమర్శలు చేసింది. మోడీ రాజస్థాన్ లోని బాన్స్ వాడా ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘ఒక వేళ కాంగ్రెస్ కు ఓటేసి అధికారం అప్పగిస్తే, అధిక సంతానం ఉండే చొరబాటుదారులకు దేశ సంపదనంతా పంచిపెట్టేస్తుంది’ అన్నారు.
దీనిపై శిరోమణి అకాలీ దళ్(బాదల్) ప్రతినిధి పరంబన్స్ సింగ్ రోమానా ఎక్స్ పోస్ట్ పెట్టారు. ‘‘విషం కక్కడం, విద్వేషం ఓ స్థాయిలో ఉంటే… మరో వైపు సార్వభౌమత్వం, సామ్యవాదం, ప్రజాస్వామిక గణతంత్రం అని దేశం గురించి చెప్పుకుంటున్నాం. మనలో ఉన్న బలహీనత ఏమిటంటే మనకు అన్యాయం జరిగినప్పుడే దానిని మనం తప్పు పడుతున్నాం. నేడు వారిని నిందిస్తుంటే, రేపు మనల్ని నిందిస్తారు. సిగ్గుచేటు, ఆందోళనకర విషయం ఇది’ అని వివరించారు.
Venom and hate at another level ‼️
Btw India is supposed to be a “Sovereign, Socialist, Secular, Democratic Republic.”The fault with all of us is that we think of injustice only when it happens against us.
If it is them today it will be us tmw.
Shameful and very disturbing ! pic.twitter.com/OxVkYCctjH— Parambans Singh Romana (@ParambansRomana) April 22, 2024