Saturday, November 2, 2024

చినుకు పడితే చిత్తడే….

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: మండలంలోని ఎల్కపల్లి (బి) రహదారి అంత బురదమయంగా ఉండడంతో ప్రతినిత్యం ప్రజలకు తిప్పలు తప్పడం లేద ని వాపోతున్నారు. ఎల్కపల్లి, సిద్దాపూర్, రంగాపూర్ గ్రామాల నుంచి ప్రతినిత్యం బెజ్జూరు మండల కేంద్రానికి విద్యార్థులు, రైతు లు, ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు.

కాని వర్షకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామాల నుండి వచ్చే ప్రజలకు బురదలో నానతంతాలు పడుతూ మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితి మారిందని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడి చిన రోడ్డు పనులు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా వర్షకాలంలో నానతంతాలు పడుతు బురదలో తిప్పలు పడుతూ తప్పనిసరిగా మండల కేంద్రానికి రావాల్సిన పరిస్థితిగా మారిందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు వెంట నే స్పందించి బురదమయంగా ఉన్న ప్రాంతాలలో రహదారిని బాగుచేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News