Monday, December 23, 2024

మళ్లీ కెసిఆర్ రాకుంటే…హైదరాబాద్ మరో అమరావతే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :  తెలంగాణలో మళ్లీ కెసిఆర్ రాకపోతే అమరావతి లెక్క హైదరాబాద్ అవుతుందని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అమరావతి లాగా ఇక్కడ కూడా బిజినెస్ అవుట్ అని భయపడుతున్నారట అని చెప్పారు. హైదరాబాద్ భూముల ధరలు ఎం త పెరిగాయి..? మూడోసారి కెసిఆర్ గెలిస్తేనే మ ళ్లీ భూముల ధరలు పెరుగుతాయని, దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అద్భుతంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ మళ్లీ సిఎం అయితే హై దరాబాద్‌కు ఇంకా పెట్టుబడులు వచ్చి, నగరానికి జోష్ వస్తుందని అన్నారు. తెలంగాణ భవన్‌లో శు క్రవారం మంత్రి హరీశ్ రావు సమక్షంలో టిపిసిసి మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష,రవి కు మార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి)తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్‌లో పార్టీలో చేరారు. వారికి మంత్రి హరీశ్‌రా వు గులాబి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆ హ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు అని విమర్శించారు. రాష్ట్రంలో బలమైన నాయక త్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉం డాలా..? అడిగారు. ఇటువైపు బలమైన కెసిఆర్ ఉన్నాడని, అవతలి వైపు ఎవరు ఉన్నారు..? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కెసిఆరే అని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్‌ది రైతుల ఎజెండా అయితే, వారిది బూతుల ఎజెండా అని మండిపడ్డారు. బూతులు మాట్లాడటం చాలా సులువు అని, కానీ నీళ్ళు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టడం చాలా కష్టమని, అలాంటి కష్టమైన పనులు కెసిఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు. బూతులు మాట్లాడేవాళ్ళు కాదు… భవిష్యత్ నిర్మించే వాళ్ళు కావాలని వ్యాఖ్యానించారు. ఒకవైపు ఐటి రంగాన్ని, మరో వైపు వ్యవసాయం రంగాన్ని సిఎం కెసిఆర్ అభివృద్ధి చేశారని చెప్పారు. బిఆర్‌ఎస్ రాష్ట్రంలో నీళ్ళ కష్టం లేదు, కరెంట్ కోతలు లేవు అని పేర్కొన్నారు. నాడు హైదారాబాద్‌లో కరెంట్ కావాలని పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారని గుర్తు చేశారు. 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నది కెసిఆర్ అని, బిఆర్‌ఎస్ పాలనలో కరువు లేదు… కర్ఫ్యూ లేదు అని వ్యాఖ్యానించారు.
జిహెచ్‌ఎంసిలో కాంగ్రెస్ ఖాతా తెరవదు
జిహెచ్‌ఎంసిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవదు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి డకౌట్, కాంగ్రెస్ రన్ ఔట్ అవుతుంది…కెసిఆర్ సెంచరీ కొడతారని, అన్ని సర్వేలు ఇదే చెబుతున్నాయని చెప్పారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని అన్నారు. అందరినీ కాపాడుకునే పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ లాగా మోసం ఉండదు, ద్రోహం ఉండదని తెలిపారు. పార్టీ చేరిన నాయకులు, కార్యకర్తలు ఉప్పల్‌తోపాటు మేడ్చల్, మల్కాజ్ గిరి సహా హైదరాబాద్ అన్ని నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. కష్టపడ్డవాళ్లందరినీ బిఆర్‌ఎస్ పార్టీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధిని చూసి సన్నీడియోల్ ఆశ్చర్యపోయారు
సినీహీరో సన్నీ డియోల్ ఎనిమిదేళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి అభివృద్ధిని ఆశ్చర్యపోయారని, తాను హైదరాబాద్‌లో ఉన్నానా.? లేక అమెరికాలో ఉన్నానా అని ఆశ్చర్యపోయారని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి నమ్మలేకపోతున్నానని సన్నీ డియోల్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ నగరం న్యూ యార్క్ లెక్క అభివృద్ధి చెందిందని అన్నారని తెలిపారు. పక్కన ఉన్న రజీనీలకు అర్థం అవుతున్నది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. 7.7 శాతం గ్రీన్ కవర్ పెరుగుదలతోపాటు భూగర్భ జలాలు 6.6 మీటర్ల మీదకు వచ్చాయని తెలిపారు. వడ్ల ఉత్పత్తి 99 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2 కోట్ల 48 లక్షలకు పెరిగిందని అన్నారు. డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అని, ప్రతి ఏటా పది వేల మంది డాక్టర్లను అందిస్తున్నామని చెప్పాఉ. తలసరి ఆదాయంలో విద్యుత్ వినియోగంలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
ప్రజాసేవలో సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి
1993లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో వివిధ కీలక పదవుల్లో పార్టీకి సేవలందించారు. విద్యార్థి సంఘంలో పనిచేయడంతో పాటు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, మల్కాజిగిరి పార్లమెంటరీ యూత్ కాంగ్రెస్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్‌గా, టిపిసిసి సెక్రెటరీగా కాంగ్రెస్‌లో కొనసాగారు. 2002లో యువసేన ఫౌండేషన్ ప్రారంభించిన సోమశేఖర్ రెడ్డి ఆ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యువసే ఫౌండేషన్ ద్వారా ఉప్పల్‌లో మంచినీళ్లు లేని ప్రాంతాలలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు రక్షిత త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా గుండె జబ్బులు వచ్చిన నిరుపేదలకు ఉచితంగా సర్జరీలు చేయడంతోపాటు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నారు. కొవిడ్ సమయంలో రూ.6 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు సేవలందించారు. ఆ సమయంలో జాతీయ మీడియా కూడా సోమశేఖర్ రెడ్డిపై కవర్ స్టోరీ చేసింది. ఉప్పల్‌లో ఆయనకు ఉన్న బలం చూస్తే ఎ.ఎస్.రావు నగర్ నుండి సోమశేఖర్ రెడ్డి సతీమణి శిరీష పోటీ చేయగా, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News