Monday, January 20, 2025

నా కుటుంబం కబ్జా చేసినట్లు కెటిఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  సచివాలయంలో ముఖ్యమంతిర రేవంత్ రెడ్డి చిట్‌చాట్ చేశారు. సిడబ్ల్యుసి సభ్యుడు పల్లంరాజు నిర్మాణానే హైడ్రా మొదటి కూల్చివేసిందని, జన్వాడ ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో కెటిఆర్ ప్రస్తావించలేదన్నారు. నిర్మాణాలకు అధికారులే అనుమతి ఇస్తారని, సర్పంచులు కాదని కెటిఆర్ తెలియదా? అని చురకలంటించారు.

తన కుటుంబం కబ్జా చేసినట్లు కెటిఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోమని, ప్రస్తుతానికి హైదరాబాద్‌కు మాత్రమే హైడ్రా పరిమితం చేస్తున్నామని, చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యమని, ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లో ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందని, చెరువుల ఆక్రమణలపై నిజనిర్థరణ కమిటీ వేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News