Thursday, December 26, 2024

మంద కృష్ణ వైఖరి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతాం

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న సీఎల్‌పి నేత భట్టి విక్రమా ర్కను రానున్న ఎన్నికల్లో ఓడించా లని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరిం చుకోవాలని, లేదంటే..తగిన బుద్ది చెబుతామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా బాగ్‌లింగంపల్లిలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడుతూ భట్టి విక్రమా ర్క సీఎం అయితే.. ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాడని వ్యాఖ్యలు చేయడం అత్యంత జుగుప్సాకరం అని దుయ్యబట్టా రు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన పదవులు పొందిన మాదిగలపై మాలలు ఏరోజు విమర్శలు చేయలేద న్నా రు. కానీ, మాల లు రాజకీయంగా ఎదగరాదంటూ మంద కృష్ణ మాది గ వ్యహారిస్తున్న తీరు చాలా బాధాకరం అని అన్నారు. కృష్ణ మాదిగ మాల ల పట్ల తన వైఖరి మార్చుకోకుంటే ఆయనను శాశ్వతంగా దళిత ద్రోహిగా ప్రజలు గుర్తిస్తారన్నారు. మంద కృష్ణకు బిజేపిపై ప్రేమ ఉంటే ఆ పార్టీ లో చేరాలని హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News