అయోధ్య: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తానే తలనరికి చంపుతానంటూ అయోధ్య మఠాధిపతి పమరహంస ఆచార్య మంఠవారం తాజాగా హెచ్చరించారు. అవసరమైతే తానే ఎంకె స్టాలిన్ కుమారుడి తల నరికివేస్తానని, ఆయన తలనరికి తెచ్చిన వారికి రూ. 10 కట్లో బహుమానాన్ని ఇస్తానని ఆచార్య ప్రకటించారు.
మంగళవారం నాడిక్కడ ఆచార్య విలేకరులతో మాట్లాడుతూ ఉదయనిధి ముందుగా సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడాలని చెప్పారు. సనాతన ధర్మాన్ని గురంచి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పని పక్షంలో ముఖ్యమంత్రి కుమారుడు అయినప్పటికీ శిక్ష తప్పదని ఆచార్య చెప్పారు. ఆయన తల నరకలేకపోతే బహుమానం సొమ్మును రూ. 10 కోట్లకు పెంచాతానని, అవసరమైతే తానే ఆయన తల నరుకుతానని ఆచార్య హెచ్చరించారు.
దేశంలో అభివృద్ధి ఏదైనా జరిగి ఉంటే అది సనాతన ధర్మాం వల్లేనని ఆయన చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలతో దేశంలోని 100 కోట్ల మంది ప్రజల మనోభావాలను గాయపిరిచారని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాలని ఆచార్య డిమాండ్ చేశారు.
కాగా..పరమహంస ఆచార్య ప్రకటనపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ ఇటువంటి ప్రకటనలకు తాను భయపడబోనని చెప్పారు. తన తాతగారు కరుణానిధి అనుసరించిన మార్గంలోనే తాను కూడా నడుస్తున్నానని, ఆయనకు కూడా ఇటువంటి బెదిరింపులు చాలా వచ్చాయని ఉదయనిధి తెలిపారు.