Saturday, December 21, 2024

ఒకవేళ 2024లో అధికారంలోకి ప్రతిపక్షం వస్తే… : నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

 

Nitish Kumar

పాట్నా: ఒకవేళ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపియేతర పార్టీ అధికారంలోకి వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తానని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. “నేను కేవలం బీహార్ గురించి మాత్రమే చెప్పడం లేదు, ఇతర రాష్ట్రలకు కూడా అది వర్తిస్తుందని చెబుతున్నాను” అన్నారు. ఆయన మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలిపారు. ఇటీవల ఆయన ఢిల్లీలో వివిధ ప్రతిపక్షనాయకులను కలుసుకున్న తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి ఆయన మాట్లాడారు. ఆయన బిజెపితో తెగతెంపులు చేసుకుని గత నెల బీహార్‌లో రాష్ట్రీయ జనాతాదళ్, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఒకవేళ ఏదేని రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కితే, కేంద్రం చేపట్టే స్పాన్సర్డ్ పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపుల నిష్పత్తి 90: 10 గా ఉండగలదు. ఇది ఇతర రాష్ట్రాలకు భిన్నంగా, అనుకూలంగా ఉండగలదు. ప్రస్తుతం ఈ ప్రత్యే కేటగిరిలో 11 రాష్ట్రాలు ఉన్నాయి. అవి: అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్(ఇప్పుడిది కేంద్రపాలిత ప్రాంతం), మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్. రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరి కల్పించే వసతి అనేది రాజ్యాంగం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పనిచేయని జాతీయ అభివృద్ధి మండలి అనేక కారకాల ఆధారంగా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని సిఫారసు చేసింది.
పార్లమెంటులో 2018లో ప్రభుత్వం ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రత్యేక హోదా కల్పించాల్సిన రాష్ట్రాల గురించి ప్రస్తావించింది. కొండలు, ఎత్తుపల్లాల ఉపరితలం, తక్కువ జన సాంద్రత/ లేక గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం, కీలక ప్రదేశం, పొరుగు దేశాలను సరిహద్దుగా కలిగి ఉన్న రాష్ట్రాలు, ఆర్థికంగా, మౌలికవసతుల దృష్టా వెనుకబడిన రాష్ట్రాలను ఈ కేటగిరిలో చేర్చుతారు. అయితే 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా అన్న భావనయే కనుమరుగయింది. అయినప్పటికీ బీహార్, ఒడిశా, జార్ఖండ్ మాత్రం పేదరికం, వెనుకబడినతనం ఆధారంగా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం నితీశ్ కుమార్ చేసిన ప్రకటన వల్ల ఆయన బిజెపియేతర ప్రభుత్వం ఏర్పాటకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. పైకి మాత్రం తాను ప్రధాని అభ్యర్థి కానని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News