ఓ స్టార్ హోటల్ పబ్‌లో యువతికి బెదిరింపు
ఇరు వర్గాల ఫిర్యాదులపై విచారణ చేపడుతున్న పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని ఓ స్టార్ హోటల్ పబ్‌లో ఫోన్ నంబర్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యా దు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ కాన్సుల్‌లో న్యూట్రిషన్‌గా పనిచేసే ఓ యువతి తన ఇద్దరు స్నేహితులు బాక్సర్ విక్రమ్, విష్ణులతో కలిసి ఈనెల 18న అర్ధరాత్రి రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఐటిసి కోహినూర్ హోటల్‌కు వెళ్లింది. అప్పటికే అక్కడ మయాంక్ అగర్వాల్, అబ్రార్, ఆరిఫ్ ఉద్దీన్, ఖాదర్‌తో పాటు మరో ఇద్దరు అదే హోటల్లోని బార్‌లో ఉన్నారు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ ఆ యువతి ఫోన్ నంబర్ అడిగారు. ఫోన్ నం బర్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అత్యాచారం చేస్తామ ని బెదిరించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె స్నేహితులు విక్రమ్, విష్ణులు మయాంక్ గ్రూప్‌తో గొడవకు దిగారని, ఆపై పరస్పరం దాడి చేసుకున్నారని తెలిపింది. ఈ ఘర్షణలో అబ్రార్‌కు గాయాలయ్యాయి. దీనిపై ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో అబ్రార్ ఫిర్యాదు చేయగా, మంగళవారం ఉదయం యువతి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సిసిటివి పుటేజీ పరిశీలించి తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరింది. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసభ్యంగా ప్రవర్తించారు
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఐటిసి కోహినూర్ హోటల్ ఎనిమిది మంది యువకులు వచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరగా ఇవ్వనని చెప్పడంతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు రేప్ చేస్తామని బెదిరింపులకు దిగారని యు వతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమం లో అక్కడే ఉన్న యువతి స్నేహితురాలు ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై మద్యం బాటిల్స్‌తో విచక్షణా రహితంగా యువకులు దాడి చేసినట్లు తెలిపింది. అడ్డుకోబోయిన పబ్ నిర్వాహకులను సైతం బెదిరించడంతో సంఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి వెళ్లానని, అనంతరం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సదరు యువతి వివరించింది.
ఇది జరిగింది : ప్రత్యక్ష సాక్షి
ఐటిసి కోహినూర్ పబ్ వ్యవహారంలో ప్రత్యక్ష సాక్షి విష్ణు అనే యువతి మాట్లాడుతూ తమపై ఓ గ్యాంగ్ దాడికి పా ల్పడిందని పేర్కొంది. అలాగే తన స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్లామని విష్ణు తెలిపింది. తమతో ఉన్న అమ్మా యి మ్యూచ్వల్ ఫ్రెండ్ తన స్నేహితులతో పబ్‌కు వచ్చిందని ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో వారిని అ డ్డుకున్నానని విష్ణు పేర్కొంది. తమను అడ్డుకుంటే తన ఫ్రెండ్ను రేప్ చేస్తామని బెదిరించారని చెప్పింది. తన త లపై బీర్ బాటిల్తో దాడి చేశారని విష్ణు తెలిపింది. తనపై దాడికి పాల్పడినవారు పలుకుబడి ఉన్నవారి పిల్లలని పేర్కొంది. దాడిపై పబ్ సిబ్బంది రిక్వెస్ట్ చేయడంతో ఫి ర్యాదు చేయలేదని పేర్కొన్నారు. తమపై దాడి దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయని విష్ణు పేర్కొంది.