Thursday, January 23, 2025

ప్లాస్టిక్ వాడితే రూ. 50 వేల జరిమానా

- Advertisement -
- Advertisement -

కొడంగల్: 125 మైక్రాన్‌ల కంటే తక్కువ ఉండే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడితే రూ. 5 వేల నుండి 50 వేల వరకు జరిమానా విధించేందుకు కౌన్సిల్ అమోదం తెలిపింది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ అదేశాలతో ప్రతి వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా 125 మైక్రాన్‌ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కవర్‌లను నిషేధించినట్లు తెలిపారు. పట్టణంలోని వర్తక వ్యాపారులు అమ్మినా, కొన్నా జరిమానా తప్పదన్నారు. హరితహారంలో భాగంగా అన్ని వార్డులో మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ట్రీ గార్డులు, బాంబు స్టీక్స్, లెబర్ ఎంగేజ్‌లకు రూ. 11 లక్షల ,15 ఫైనాన్స్ నిధులను ఖర్చు చేసేందుకు కౌన్సిల్ అమోదం తెలిపింది.

అలాగే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా అన్ని వార్డుల్లో హైపో క్లోరైడ్, ఆయిల్ బాల్స్ తయారు చేసే సామాగ్రి కొనుగోలు చేసేందుకు రూ. 5లక్షల నిధులకు ఆమోదం లభించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News