Saturday, November 23, 2024

కాంగ్రెస్ కు అధికారమిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే

- Advertisement -
- Advertisement -

ఆలోచించి, చర్చించి ఓటేయండి
కెసిఆర్ దమ్మును దేశమంతా చూసింది
నవంబర్ 30న ఓట్ల సునామీతో దుమ్ము రేగాలి

బిఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యాన్నిఅందించాలి

ఓడితే మాకు నష్టం లేదు రెస్ట్ తీసుకుంటాం..

బిఆర్‌ఎస్ ఓడిపోతే ప్రజలకే నష్టం..

దేశంలో 24గంటలు కరెంటు ఇస్తున్నది తెలంగాణ మాత్రమే..

ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు

దళిత బంధు, రైతుబంధు పుట్టించింది నేనే… గిరిజన బంధు తెస్తాం
పదుల్లో ఉన్న పెన్షన్ వేలల్లోకి పెంచాను

కాంగ్రెసోళ్లు వచ్చి ధరణి తీసేస్తే రైతులకే నష్టం
అచ్చంపేట ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్

మలి విడత ఎన్నికల ప్రచారానికి బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్ గురువారం నాడు శ్రీకారం చుట్టారు. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులలో సుడిగాలి పర్యటన జరిపి ‘ప్రజా ఆశీర్వాద’ సభల్లో ప్రసంగించారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలు రాష్ట్రానికి చేటు చేస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. అచ్చంపేటలో జరిగిన సభలో గిరిజన బంధు తెచ్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. వనపర్తి సభలో స్థానిక విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. పాలమూరుకు అడ్డం పడిన నేతలు ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివన్నగూడెంకు కృష్ణా జలాలు తరలించి 2.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని మునుగోడు ప్రజలకు కెసిఆర్ అభయమిచ్చారు.

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : అయినోడు కానోడు…లేచినోడు లేవనోడు వచ్చి ఓట్ల కోసం మిమ్మల్ని మభ్య పె ట్ట చూస్తాడని, నవంబర్‌లో దుమ్మురేగాలే బిఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాలే అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట లో ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగించారు. 24 ఏళ్లుగా తెలంగాణ కోసం ఈ ప్రాంత బిడ్డలు పోరాడుతుంటే ఇంత కాలం జాడ లేనోడు పదవుల కోసం మభ్య పెట్టడానికి వస్తాడ ని,వారి మాటలు నమ్మవద్దని ఇవాలా ఈ వేదిక నుంచి కెసిఆర్ చెప్పిన మాటలు మీ ఊరికి వెళ్లి ఆలోచించే విధంగా చర్చించుకుని ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

పదేళ్లుగా తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకుని దేశానికే మార్గదర్శంగా నిలిచామన్నారు. సాగు, తాగునీటి రంగాలు, విద్యుత్ రంగంతో పాటు పారిశ్రామిక, ఐటి రంగంలో కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించామన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు గులగుల అయితా ఉందని, మళ్లీ ఆగం చేయాలని చూస్తున్నారని కెసిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ చేతికి పగ్గాలిస్తే పాత కథే మోపవుతుందన్నారు. అవే విద్యుత్ కోతలు, అవే సాగునీటి కష్టాలు, అవే మోటార్లు కాలుడు, అదే దళారుల దో పిడీ తిరిగి చూడాల్సి వస్తుందన్నారు. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని హెచ్చరించారు. ధరణితో దళారి వ్యవస్థ, పైరవీకారులను లేకుండా తాము చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని చెబుతున్న దానిలో దోపిదీ దాగి ఉం దన్నారు. ధరణి వల్లే నేడు రైతుల భూములు భద్రంగా ఉన్నాయన్నారు. ఈ వ్యవస్థను తీసివేస్తే మళ్లీ పాత కథ వచ్చి విఆర్‌ఓలు, గిర్దావర్‌లు పైరవీకారులతో ఇబ్బందులు తప్పవన్నారు. మీ అధికారాన్ని కాంగ్రెస్ తీసుకోచూస్తుందని అలాంటి వారిని ఉపేక్షించవద్దన్నారు. పది శాతం లేని బిజెపోళ్లు తెలంగాణలో ఎగిరెగిరి పడుతున్నారని వారు పాలిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ పథకాలనుఎందుకు అమలు చేయరనికెసిఆర్ ప్రశ్నించారు.

కెసిఆర్ దమ్ము ఏందో దేశం మొత్తానికి ఎరుక అని కెసిఆర్ అ న్నారు. ఒకడు కెసిఆర్ నీకు దమ్ముందా..ఉంటే కొడంగల్‌కు రా..అంటాడు. మరొకడు గాంధీ బొమ్మ దగ్గరకు రమ్మంటా డు.. నా దమ్మేందో దేశ ప్రజలందరికి తెలుసని తెలంగాణ సా ధించి రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలిపానని అంతకంటే దమ్ము ఏం చూస్తారని కెసిఆర్ ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం గురించి కెసిఆర్‌ను చూసి నేర్చుకోవాలన్నారు.
రైతు బంధును పుట్టించిందే కెసిఆర్
రైతు బంధు పథకాన్ని పుట్టించి దేశానికి పరిచయం చేసిందే కెసిఆర్ అని ముఖ్యమంత్రి అన్నారు.ఇన్నేళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన వారికి రైతులకు మేలు చేయాలన్న పథకాలు గుర్తుకురాలేదా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు 24గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, సాగునీరు అందించి దేశానికే తెలంగాణ మార్గదర్శకంగా నిలిచిందన్నారు. నేడు తెలంగాణలో 3కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయని దీనిని 4కోట్లకు పెంచుకోవడానికి చూద్దామా..? ముండమోపి గాళ్లకు అధికారం కట్టబెట్టి ఆగం చేసుకుందామా..? అని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని, సా గునీటి రంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నా రు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 5ఏళ్లలో ఇంటింటికి నల్లా ఇచ్చే పథకం మిషన్ భగీరథ ద్వారా అందిస్తామని చెప్పడం జరిగిందని, 5 ఏళ్లలో చేయకపోతే ఓట్లు వేయవద్దని చెప్పిన ఏకైక సిఎం కెసిఆర్ అని ఆయన అన్నారు. నల్లమల్లలో ని అప్పర్ ప్లాట్ ప్రాంతంతో పాటు గోండు గూడాలు, తాండా లు, చెంచు పెంటలకు సైతం మిషన్ భగీరథ ద్వారా నీరు ఇ చ్చిన ఏకైక సిఎం కెసిఆర్ అన్నది గుర్తుంచుకోవాలన్నారు. దేశ చరిత్రలో ఏ సిఎం చేయని పనిని తానుచేసి చూపించానన్నారు.
సమాజంలోని విధి వంచితులను ఆదుకోవడం కోసం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా పెన్షన్ పథకాన్ని తెలంగాణలోని మా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఏడాదికి 500 చొప్పున పె న్షన్ పెంచుకుంటూ 5 ఏళ్ల కాలంలో రూ. 5 వేల పెన్షన్ అందించే లక్షంగా ముందుకు సాగుతున్నామన్నారు. తప్పు డు మాటలు చెప్పి బోర్లా పడడం తమకు రాదన్నారు.

రైతు బంధును 16 వేలకు పెంచుతాం
రైతు బంధును ప్రస్తుతం ఎకరాకు 12 వేలు చెల్లిస్తున్నామని క్రమక్రమంగా రైతు బంధు నిధులను పెంచుతూ ఎకరాకు 16 వేలకు పెంచుతామని కెసిఆర్ అన్నారు. చేతగాని మాటలు చె ప్పి ఓట్లు అయిన తెల్లారి ఎల్లెలికలా పడకూడదని తాము భావిస్తున్నామన్నారు. ఎకరాకు 16 వేలు చేసి చూపిస్తామని, రైతు లు కల్లబోల్లి మాటలు చెప్పే వారికి నమ్మవద్దని కెసిఆర్ అన్నా రు. కర్ణాటకలో కరెంట్ ఇవ్వలేక ఎల్లెలికలా పడ్డ కాంగ్రెస్ గురించి ఆ రాష్ట్ర ప్రజలు ఇక్కడికి వచ్చి వారి దౌర్భాగ్యాన్ని వివరిస్తున్నారని అన్నారు. నెల నెల రేషన్ షాపుల ద్వారా దొడ్డు బి య్యం ఇచ్చే పథకాన్ని పక్కన పెట్టి నెల నెల సన్నబియ్యం ఇ స్తామన్నారు. నేడు తెలంగాణ అన్నపూర్ణగా మారిందని, వరి పంట పండించడంలో తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. దళితులను దశాబ్ద కాలంగా దగా చేసింది ఎవరని కెసిఆర్ ప్రశ్నించా రు. అనాధిగా అధికారంలో ఉండి దళితుల గురించి, వారి అ భ్యున్నతి గురించి పట్టించుకోలేదన్నారు. దళిత బంధుతో తెలంగాణలో వారి అభ్యున్నతికి పాటు పడుతున్నామన్నారు. అనాధిగా నానుతూ వస్తున్న పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దళిత, గిరిజనులకు పోడు పట్టాలను అందించామన్నారు. పట్టాలతో పా టు వెంటనే రైతు బంధును కూడా అమలు చేసిన ఘనత మా సర్కార్‌కే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో గిరిజన బంధు అమలు కోసం పరిశీలిస్తున్నామన్నారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీలకు సముచిత గౌరవం అం దించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కెసిఆర్ అన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలల ను సైతం ఏర్పాటు చేస్తామన్నారు.

కెసిఆర్ చెప్పింది గల్లీ గల్లీలో చర్చ జరగాలి
తాను ప్రజా ఆశీర్వాద సభా వేదికగా చెప్పిన మాటలు గల్లీగల్లీలో చర్చ జరగాలని, ఎవరికి అధికారం కట్టబెట్టాలో ఆలోచిం చి నవంబర్ 30న ఓటు వేయాలని కెసిఆర్ కోరారు. ప్రతి పథకాన్ని బేరీజు వేసుకోవాలని, వంద ఉన్న పెన్షన్‌ను 2వేలు చేసిందెవరు, మున్ముందు మరింత పెంచేది ఎవరు అన్న విషయాన్ని చర్చించాలన్నారు. తెలంగాణ పథకాలు రైతులు, పీడిత, తాడిత ప్రజలు, పేదలకు వరంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. మన బ్రతుకులు బాగుపడాలంటే ఎవ రు అధికారంలో ఉండాలన్నది ప్రజలు గుర్తించాలన్నారు. పదేళ్లుగా అభివృద్ధి చేసుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దని చెప్పే బాధ్యత, కర్తవ్యం మాదని, ఆపై నిర్ణయం మీదేనని ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ అన్నారు. అ చ్చంపేటను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, 60 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఉమామహేశ్వర లిఫ్టును మంజూరు చేశామని, అప్పర్ ప్లాట్ వరకు నీటిని అందించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని అన్నారు. నర్సింగ్ కళాశాల, ఇతర అభివృద్ధి పనులను గువ్వల బాలరాజు అడిగారని వీటన్నింటిని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జిఓలు ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. గువ్వల బాలరాజును అచ్చంపేటలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మధుసూదన చారి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News