Sunday, December 22, 2024

ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయకపోతే… : రేణుకా చౌదరి

- Advertisement -
- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి

మనతెలంగాణ/హైదరాబాద్:  లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయకపోతే తాను ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పేర్కొన్నారు.  ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీని ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తామే కోరినట్లు తెలిపారు. స్వయంగా సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తే.. అంతకంటే అదృష్టం ఏముంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ తన నిర్ణయం ఏమిటో చెప్పే వరకు ఎవరూ అభ్యర్థి కాదని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే తానే పోటీ చేస్తానని రేణుకా చౌదరి మనసులోని మాట బయటపెట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాలకు పైగా కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆమె జోస్యం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News