Monday, December 23, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను గోస పెడుతుంది

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు మూడు గంటలు కరెంటు ఇవ్వాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను గోస పెట్టుతుందని, రేవంత్ మాటలతో బయట పడిందన్నారు. రైతు బాగుపడితే చూడలేని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తారనడం సరైంది కాదన్నారు. రైతుబందు కట్ చేస్తారని, అన్ని సంక్షేమ పథకాలు బంద్ అవుతాయన్నారు.

బీజేపీ మోటార్‌లకు మీటర్లు పెడతామంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. బీమా ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం తమ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఏఎంసీ, ఫ్యాక్స్ చైర్మన్‌లు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కోఆప్షన్‌లు, అనుబంద సంఘాల అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News