మెదక్ : గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు అకుంఠిత దీక్షతో పనిచేయడం వల్లే నేడు గ్రామాలు పచ్చదనంతో పరిడవిల్లుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక మాయా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతూ పల్లెలు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్రముఖ్యమంత్రి మదిలో మెదిలిన ఆలోచన మానస పుత్రికలే ఈ కార్యక్రమాలకు నాంది అన్నారు. ఒకప్పుడు పల్లెలు అపరిశుభ్ర వాతవరణం కలిగి శిథిలమైన భవనాలు, ముళ్లపొదలు, మురుగునీరు, సరైన రహదారులు, మంచినీటి సౌకర్యాలులేక నానా ఇబ్బందులు పడ్డారని, కానీ నేడు పల్లె ప్రగతి ద్వారా చేపట్టినకార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు తపనతో పనిచేయడం వల్లే పల్లెలలో గుణాత్మక మార్పులు వచ్చాయన్నారు.
ప్రతి గ్రామపంచాయతీలో డంప్‌యార్డులు, వైకుంఠదామాలు, నర్సరీలు, పల్లెప్రకృతివనాలు,క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాక్టర్, ట్రాలీ, డోజర్, వంటివి అందించి పరిశుభ్రతకు పెద్దపీట వేశామన్నారు. గాందీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్య దిశగానేడు పల్లెలు స్వయం సమృద్ధ్ది సాదించాయని, పట్టణాలకువలసలు వెళ్లిన వారు తిరిగి పల్లెల వైపు చూస్తున్నారని అన్నారు. భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతవరణం కల్పించుటకు పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టామని అన్నారు. అదేవిధంగా పట్టణాలలో పరిశుభ్రతకు సిఫాయి కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకోవడంతోపాటు చెత్త సేకరణ వాహనాలను సమకూర్చామని అన్నారు. టిఎస్‌బిపాస్ ద్వారా భవన నిర్మాణాలకు తక్షణ అనుమతులిస్తున్నామని, పేద వారికి ఒక రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నామని అన్నారు.
త్వరలో జిల్లాకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల అభివృద్ధ్దికి నిధులు కోరతామని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాదించిన గ్రామాలలో ఎదో అసంతృప్తి ఉందని, గ్రామాలకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెళ్లలేని పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి మేధావులతో చర్చించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. నేడు పల్లెలలో జవాబుదారితనం, పోటీతత్వం పెరిగి ఒక గ్రామాన్ని మించి మరో గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుటలో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధ్ది బండి చక్రాల నిరంతరం శ్రమిస్తున్నారని 90 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. నేడు ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్బయంగా పల్లెల బాట పడుతున్నారన్నారు.
నేడు పల్లెలు దేశానికి దిక్సూచిగా, రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని అన్నారు. పంచాయతీరాజ్,మున్సిపల్ చట్టాలను సరళం చేస్తూ బాధ్యతలు ఫిక్స్ చేసినందున నేడు ప్రజాప్రతినిధులు, అధికారులతో జవాబుదారితనం పెరిగి సమన్వయంతో ప్రణాళికతో పనిచేస్తున్నారన్నారు. ప్రతిగ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధ్ది కార్యక్రమాల వల్ల గ్రామాలలో ఆహ్లాదవాతవరణం నెలకొందని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ప్రజాప్రతినిధులకు,అధికారులు, సిబ్బందికి,సిఫాయి కార్మికులకు జ్ఞాపిక, ప్రశంసపత్రంతో అతిథులు సన్మానించారు.
అంతకుముందు పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపైప్రచురించిన కరపత్రాలనుముఖ్య అతిథిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రవీందర్‌గౌడ్, జితేందర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్లు జానకిరామ్‌సాగర్, మోహన్, గోపాల్, ఉమాదేవి, జడ్పీ సీఈఓ శైలేష్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీపీఓ సాయిబాబా, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.