Thursday, December 26, 2024

జిల్లాలను టచ్ చేస్తే… ప్రతిఘటన…

- Advertisement -
- Advertisement -

జిల్లాల సంఖ్యను తగ్గించేందుకే కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కెసిఆర్ సిఎం కానందుకు బాధపడుతున్నారు

పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోంది ఈ మూడు ముక్కలాటలో బిఆర్‌ఎస్‌కే

పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి

బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది

సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేది

తెలంగాణ పదం మాయం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి

బిఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. ఒకవేళ అలా జరిగితే ప్రజలు ఊరుకుంటారా..? అని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు ప్ర శ్నించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో బిఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పలుఅంశాలపై కెటిఆర్ చర్చించారు. ఈ సం దర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉ న్న జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సిఎం రేవంత్‌రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని చెప్పారు. ప్ర భుత్వం మీద విమర్శల విషయంలో మనం తొం దరపడడం లేదని పేర్కొన్నారు. మనం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్లే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తమను విమర్శిస్తే వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ప్రజల్లో కెసిఆర్‌పై అభిమానం చెక్కు చెదరలేదు
ప్రజల్లో కెసిఆర్‌పై అభిమానం ఏమాత్రం చెక్కు చెదరలేదని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కెసిఆర్ సిఎం కానందుకు బాధపడుతున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగాలేకపోయినా ప్రజలు దీవించారని గుర్తుచేశారు. ఈసారి 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది చిన్న సంఖ్య ఏమీ కాదని పేర్కొన్నారు. మూడింట ఒక వంతు సీట్లు గెలిచామని చెప్పారు. జుక్కల్‌లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని, కేవలం పదకొండు వందల ఓట్లతో ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత గెలిచారన్నారు. ఇలాంటి విచిత్రాలు చా లా జరిగాయని అన్నారు. దళిత బంధు పథకాన్ని నిజాం సాగ ర్ మండలం మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు బిఆర్‌ఎస్‌కు ఓట్లు వేయలేదని చెప్పారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని కెటిఆర్ పేర్కొన్నారు. ‘బంధు’ పథకాల ప్రభావం బిఆర్‌ఎస్‌పై పడిందని చెప్పారు.
తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు కుట్రలు
బిఆర్‌ఎస్ బలంగా లేకపోతే మళ్లీ తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బిఆర్‌ఎస్ మా త్రమేనని స్పష్టం చేశారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు అప్పుడే నిరసన సెగలు మొదలయ్యాయన్నారు. అ ప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాం గ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని, ఈ మూడు ముక్కలాటలో బిఆర్‌ఎస్‌కే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. కెసిఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయానికి బాటలు వేస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ సర్కారు తెచ్చిన పథకాలను రద్దు చేస్తున్నదని విమర్శించారు.
సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేది
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని కెటిఆర్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని అన్నారు. 1985 నుంచి -89-మధ్య ఎన్‌టిఆర్ ఎన్నో మంచి పథకాలు తెచ్చినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపా రు.1989లో ఓడిపోయిన టిడిపి ఆ తర్వాత మొదటి విడతలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 21 ఎంపి సీట్లలో 19 గెలిచిందని చెప్పారు. మొన్న కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు కూడా ఇప్పుడు పునారాలోచనలో పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ 420 హామీల ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని కెటిఆ ర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ సీటును బిఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని చెప్పారు. 2009లో కేవలం 10 అసెంబ్లీ సీట్లే గెలిచామని, కెసిఆర్ దీక్షతో ఆరు నెలల్లోనే పరిస్థితి మారిందని, గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని కెటిఆర్ గుర్తుచేశారు.
తెలంగాణ గళం వినబడాలంటే బిఆర్‌ఎస్ ఎంపిల సంఖ్య బలంగా ఉండాలి: హరీశ్‌రావు
పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినబడాలంటే బిఆర్‌ఎస్ ఎంపిల సంఖ్య బలంగా ఉండాలని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బిఆర్‌ఎస్ ఎంపిలు లోక్‌సభలో లేకపోతే కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్టుగా ఉంటుందని విమర్శించారు. బిఆర్‌ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. మనం అధికారం కోల్పోయినప్పటికీ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే ఉందని ఈ సమావేశాలు జరుగుతున్న తీరు సూచిస్తున్నదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని దిగమింగుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదల పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తున్నదని చెప్పారు. లోపాలను సమీక్షించుకుని పా ర్లమెంట్ ఎన్నికల నాటికి వాటిని పునరావృతం చేయొద్దని పా ర్టీ పట్టుదలగా ఉందని తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో చేసిన అభివృద్ధితో పాటు ఢిల్లీలో కేంద్రంతో తెలంగా ణ సమస్యలపై బిఆర్‌ఎస్ చేసిన పోరాటాన్ని ప్రజలకు గుర్తు చే సి ఓట్లు అడుగుదామని చెప్పారు. కెసిఆర్ ఎంతో ఆలోచించి దేశంలోనే వినూత్నంగా ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్ర భుత్వం రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారిం చే బదులు బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైందని ధ్వజమెత్తారు. మనకు బలం ఉంది కార్యకర్తల బలగం ఉంది.. ఎవరూ అధైర్య పడొద్దు అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పా టు చేసుకుంటే వాటి స్వరూపాన్ని కూడా మార్చాలని చూడ టం దుర్మార్గం కాదా…? అని ప్రశ్నించారు. అనవసరమైన వా టి మీద సమయం వృధా చేసే బదులు కాంగ్రెస్ ప్రభుత్వం హా మీల అమలుపై పని మొదలు పెట్టాలని సూచించారు. ప్రజా పాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో కోటి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటికి ఏ మాత్రం జా ప్యం చేయకుండా మోక్షం కల్పించాలని కోరారు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడతామంటే కుదరదని చెప్పారు. వంద రోజు ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పప్పులు ఉడకవు అని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ పార్టీ తరపున తప్పులు జరిగి ఉంటే కార్యకర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేవారు. భవిష్యత్తు బిఆర్‌ఎస్‌దే అని, కార్యకర్తలు అధైర్యపడొద్దని హరీశ్‌రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News