Wednesday, January 22, 2025

50 వేల ఓట్ల మెజార్టీ తగ్గితే రాజకీయ సన్యాసం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, నల్లగొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అక్రమంగా సంపాందించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమన్వయంతో పని చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుతం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News