Saturday, December 21, 2024

పార్టీ ఫండ్ ఇస్తే….టికెట్ ఖరారు

- Advertisement -
- Advertisement -

ఉచితంగా ఇవ్వడం కుదరదని ఆశావాహులకు ఆదేశాలు
పార్టీ కార్యక్రమాలు నిర్వహణ ఫండ్‌తో ముందుకు
ముందుగా చెల్లించిన వారికే ఎంపికలో ప్రాధాన్యత
పార్టీ నిబంధనలతో పలువురు అభ్యర్థులు వెనకడుగు
బిఎస్పీలో కూడా పార్టీ ఫండ్ రాగం వినిపిస్తుందని విమర్శలు

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో ఎప్పటికే ఎన్నికల వాతావరణ రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే బిఆర్‌ఎస్ పూర్తి అభ్యర్థుల జాబితా విడుదల చేయగా, కాంగ్రెస్ 55 మంది, బిస్పీ 20 మందితో కూడిన జాబితాను వారం రోజుల కితం విడుదల చేశాయి. ఇంకా రెండు పార్టీల్లో సగానికిపై అభ్యర్థుల జాబితా విడుదల చేయాల్సి ఉండగా పలువురు ఆశావాహులు పార్టీ కార్యాలయాలు చుట్టు చక్కర్లు కొడుతున్నారు. తాను పార్టీని నమ్ముకుని శ్రమిస్తూంటే తన అభ్యర్థిత్వం ఎందుకు ప్రకటించడంలేదని పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు ముందుగా పార్టీ ఫండ్ చెల్లించిన వారే పేర్లు పరిగణలోకి తీసుకుంటున్నామని, పార్టీకి నిధులు ఇవ్వలేని వారిని చివరి సయమంలో ఎంపిక చేస్తామని, ముందుగా ఫండ్ ఇచ్చినవారి పేర్లు ప్రకటిస్తామని బాహాటంగా చెబుతున్నట్లు ఆశావాహులు చెబుతున్నారు. దీంతో పలువురు అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని సందేహాంలో పడ్డారు. ఈ విధానం కాంగ్రెస్, బిజెపి, బిఎస్పీ పార్టీలో జరుగుతున్నట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఎక్కువ పోటీ ఉన్న పార్టీలో రూ. 5 కోట్లవరకు ఫండ్ ఇవ్వాలని, చిన్న చితకా పార్టీల్లో రూ. 10 లక్షల వరకు ఆశావాహాలు చెల్లించాలని కోరుతున్నారు.

పార్టీ నిబంధనలతో కొంతమంది అభ్యర్థులు ఇన్నాళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తే ఫండ్ పేరుతో టికెట్లు రాకుండా ఎత్తు గడలు వేశారని ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొందరు అడ్డదిడ్డంగా సంపాదించుకున్న నాయకులు పార్టీకి మోసం చేసి ఇతర పార్టీలో రాత్రికి రాత్రి చేరి పార్టీ ఫండ్ కోట్ల రూపాయలు ఇస్తామని ఒప్పందాలు చేసుకుంటూ నిజమైన పార్టీ కార్యకర్తలకు దక్కకుండా కుట్రలకు పాల్పడుతున్నారని పలువురు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఏపార్టీ అధికారంలో ఉంటే అక్కడ తిష్టవేసి అక్రమంగా సంపాదన పొగు చేసుకుని నిజమైన నాయకులను చట్ట సభల్లోకి రాకుండా అడ్డుపడుతున్నారని విరుచుకపడుతున్నారు.

కొన్ని పార్టీలు సోషల్ మీడియా ద్వారా మొదటి జాబితా సిద్దమైందంటూ విడుదల చేస్తూ పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి పనిచేసివారి పేర్లు లేకుండా చేస్తున్నారు. గట్టి పోటీ ఉన్న చోట్ల ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పేర్లు వెల్లడించి వారిలో ఎవరు ముందు పార్టీ నియమాలు పాటిస్తారో వారికే భిపామ్ దక్కుతుందని లీకులు చేస్తున్నారు. ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్దులంతా మొదటి విడుత ప్రచారం నిర్వహించారు. బిస్పీ 20 మందితో కూడిన అభ్యర్థుల లిస్టు విడుదల చేసింది. దీంతో మిగతా నియోజకవర్గాల అభ్యర్థులు తమ పేర్లు ఎందుకు ప్రకటించలేదని ఆపార్టీ చీప్‌పై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆపార్టీకి చెందిన కొంతమంది నాయకులు పార్టీ పండ్ చెల్లిస్తే టికెట్ వస్తుందని చెబుతుండటంలో ఆశావాహులు పార్టీ పెద్దలపై విమర్శలు చేస్తున్నారు. బహుజనుల కోసం పార్టీ ఉందని చెపుతూ వసూలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ లోపు పార్టీ కోసం పనిచేసే వారిని అభ్యర్థులుగా ప్రకటించక పోతే తమ తడాఖా ఏమిటో చూపిస్తామని సవాల్ విసురుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News