Monday, April 28, 2025

సర్వేను పారదర్శకం చేయకపోతే చర్యలు తప్పవు: కలెక్టర్ రాజర్షి షా

- Advertisement -
- Advertisement -

ఉట్నూర్: సమగ్ర కుటుంబ సర్వేను పారదర్శకంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను హెచ్చరించారు. ఉట్నూర్ లో సర్వే వివరాలను ఆయన ఎంపిడిఓ రాం ప్రసాద్, ఎంపిఓ మహేశ్ లను అడిగి తెలుసుకున్నారు. సర్వే బ్లాకుల ప్రకారం వివరాలను అడిగారు. ఇంటింటికి వేస్తున్న స్టిక్కర్ లను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఎన్యూమరేటర్ బ్లాక్(ఈబి)లో బై(/) అనే ఆబ్లిక్ వేయడం ఏమిటని ఎంపీడివోపై అసహనం వ్యక్తం చేశారు. కొత్త నంబర్లు వేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ట్రయినీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియ, ఉట్నూర్ జిపి ఈవో శంకర్, సిబ్బంది అజిత్, ఆయా శాఖల అధికారులు వెళ్లారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News