హైదరాబాద్ : వాహనదారులను సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలపై నిలిపితే జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తే 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయా లని సూచించారు. వివరాల్లోకి వెళితే.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరా బాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు.
పార్కింగ్ చేసిన వాహనాలను భారీ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పారు. క్యారేజ్‌వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిం చారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.