Monday, December 23, 2024

మార్పులు, చేర్పులు ఉంటే సరి చూసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : కొత్తగా ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, ఓటరు జాబితాను సరి చూసుకోవడం వంటివి చేపట్టేందుకు ఆగస్టు 26,27 , సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్ర మాలుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 18 సంవత్స రాలు పైబడిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం లో భాగంగా ఆగస్టు 26,27తో పాటు సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం రోజులుగా నిర్వహించడం జరుగుతున్నదని, ఈ నాలుగు రోజుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు వారి పోలింగ్ కేంద్రాల లోనే ఉంటూ ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకునేటట్లయితే వారికి ఫారం 6 ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఆయా పోలింగ్ కేంద్రాల తనిఖీ సందర్భంగా కొత్త ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు వచ్చిన ఫారాలు , చనిపోయిన ఓటర్ల వివరాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ నాగార్జున, జడ్చర్ల తహసీల్దార్ శ్రీనివాసులు, భూత్పూర్ తహసీల్దార్ బాను కిరణ్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News