Thursday, January 23, 2025

ఆరుగురు ఓటర్లుంటే.. ఇంటింటి సర్వే

- Advertisement -
- Advertisement -
కొత్త ఓటరు దరఖాస్తులు 17 లక్షలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నవారి సంఖ్య 17 లక్షలకు చేరుకుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీన ప్రచురించిన ఓటర్ల జాబితా తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం ద్వారా 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా…అందులో జిహెచ్‌ఎంసి పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో 7.15 లక్షల మంది దరఖాస్తులు ఉన్నాయి. ఓటర్ల పేర్లు, చిరునామా దిద్దుబాటు, మార్పులకు 11.80 లక్ష ల ఫారం 8 దరఖాస్తులు రాగా…వీటిలో 3.77 లక్షల దరఖాస్తులు జిహెచ్‌ఎంసి పరిధిలోని 4 జిల్లాల నుంచే ఉన్నాయి.

ఇంత పెద్ద సంఖ్యలో ఫారం 8 దరఖాస్తులు రావడం ప్రథమం అని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాల్లో తప్పులు, సవరణలు చేసుకునేందుకు ప్ర త్యేక శిబిరాల్లో అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఆరుగురు ఓటర్ల కంటే అధికంగా ఉన్న ఇళ్లల్లో ధ్రువీకరణ, చిరునామాలు, పేరు, వయస్సు, ఫోటో చిత్రాలు వంటి ఇతర వివరాలను సరిచేసే లక్ష్యంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు వీలుగా నియోజకవర్గాల వా రీగా తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్ పర్యవేక్షణలో 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 18 ఏళ్ల వయస్సులో ఉన్న యువ ఓటర్లను నిర్ధారించడానికి ఔట్రీచ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శేరిలింగంపల్లి ఓటర్ల జాబితా ఫిర్యాదుపై విచారణ..
శేరిలింగంపల్లిలో ఒకే ఇంటి నంబర్లు కలిగిన 5155 మంది ఓటర్లకు సంబంధించి అందిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో బిఎల్‌ఓల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేయగా 5024 మంది ఓటర్లు నివసిస్తున్నట్లు తేలిందని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఇంటి నంబర్లు సరిగ్గా ఒకేలా లేవని తెలిపారు. 116 బిఎల్‌ఓల బృందం సం ఘాల సహకారంతో 1114 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లలో నమోదు కో సం ప్రత్యేక ప్రచారాలను నిర్వహించిం ది. ఈ ప్రక్రియలో 10275 ఫారం -6, 5495 ఫారం -8 సేకరించి పరిష్కరించా రు. మొత్తం 15,49110 గృహాల సర్వే చేయగా.. చనిపోయిన ఓటర్లను తొలగించి.. 5628 ఫారం -6, 11659 ఫా రం -8, 6841 ఫారం- 7 దరఖాస్తులను సేకరించారు. శేరి లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 3 లక్షల మంది ఓటర్లకు సంబంధిత ఫిర్యాదులపై విచారణ జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News