Wednesday, January 22, 2025

అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, వర్షాలు సంమృద్ధ్దిగా కురిసి, అమ్మవారు అందరిని చల్లంగా చూడాలని పూజలు నిర్వహించినట్లు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని 10వ వార్డులోని సాయికృపనగర్ కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సతీమణి పుష్పమ్మతో కలిసి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ప్రతియేటా దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం, బోనాలు సమర్పి ంచడం జరుగుతుందన్నారు. చిన్నా పెద్ద అందరూ సంతోషంగా ఉండేలా దీవించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ రమాదేవి రాజాగౌడ్, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, నాయకులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News