- Advertisement -
పెద్దపల్లి: కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపిసేత జెన్ కో పవర్ ప్లాంట్ తెస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గోదావరిఖనిలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం కట్టినా కరీంనగర్ ప్రజలకు చుక్క నీరు రాలేదన్నారు. ఎన్నికల్లో బాగా పనిచేసే కార్యకర్తలకు మంచి పదవులిస్తామన్నారు. నిస్వార్థంగా ప్రజా సేవ చేయాలన్న ఆశయంతో గడ్డం వంశీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు.
గడ్డం వంశీని గెలిపించడమన్నది ప్రతి కార్యకర్త కర్తవ్యం అన్నారు. అన్నీ ఆలోచించే గడ్డం వంశీకి హైకమాండ్ టికెట్ ఇచ్చిందని శ్రీధర్ బాబు అన్నారు. ఓడిన బిఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ కు కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం దూషిస్తున్నారని అన్నారు.
- Advertisement -