Saturday, November 23, 2024

ప్రజల సంక్షేమం కోసం చేసిన పనిని చెప్పకుంటే అబద్ధం రాజ్యమేలుతుంది

- Advertisement -
- Advertisement -
  • తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు సిద్దిపేట ప్రజల కోసం దారపోస్తా
  • అధిక లాభాలను ఆర్జించే పామాయిల్ తోటలను పెట్టాలి
  •  రూ.160 కోట్లతో నిర్మిస్తున్న 41 కిలో మీటర్ల రింగ్ రోడ్డును 4 నెలల్లో పూర్తి చేశాం
  •  హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్వేను తలపించేలా రింగ్ రోడ్డు నిర్మాణం
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: ప్రజల సంక్షేమం కోసం చేసిన పనిని చెప్పకుంటే అబద్ధం రాజ్యమేలుతుందని నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు మీ కోసం దారపోస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో రిండ్ రోడ్డు వద్ద రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత ఉత్సవంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 160 కోట్ల రూపాయలతో 41 కిలో మీటర్ల రింగ్ రోడ్డును యుద్ధ స్ఫూర్తితో 4 నెలల్లో పూర్తి చేశామన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ రన్వేను తలపించేలా రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. రింగ్ రోడ్డు నిర్మాణంలో చెట్ల తొలగించడంతో ఎంతో బాధ కలిగి రింగ్ రోడ్డు చుట్టూ రెండు వైపులా మొక్కలు నాటి పెద్దవి చేసేందుకు 3 కోట్ల 34 లక్షల రూపాయలతో ఆటవీ శాఖ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

మన ప్రజలు మన ప్రాంతం అనే చిత్తశుద్ధితో చేస్తున్న పనులకు ఇది నిదర్శనమన్నారు. తెలంగాణ రాకుంటే సిఎం కెసిఆర్ కాకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేనన్నారు. పుల్లూరులో 9 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధికి ఈ రోజు శంకుస్థాపన చేశారు. పిడబ్లూడి రోడ్డు నుంచి పుల్లూరు వరకు 2 కోట్ల 95 లక్షల రూపాయలతో డబుల్ లైన్ బిటి రోడ్డు, పుల్లూరు ఎస్సీ కాలనీ నుంచి రామంచ వరకు 3 కోట్లతో బీటీ రోడ్డు , నారాయణరావు పేటకు 1.80 కోట్లతో రోడ్డు, గాడిచర్లపల్లి మీదుగా నాసర్‌పురా వరకు 1 కోటి 56 లక్షల రూపాయలతో రోడ్డు మరమ్మతు పనులు చేసుకున్నామన్నారు. 40 పుల్లూరు గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. పిహెచ్జి, ఎన్‌ఎం సబ్ సెంటర్ , అర్బన్ హెచ్‌సి మరమ్మతు పనులను డిఎం అండ్ హెచ్‌ఓ త్వరగా పూర్తి చేయాలి ఎల్‌నీఓ ప్రభావంతో వర్షాలు పడకున్న మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నుంచి పంటలకు సాగునీరు అందిస్తామన్నారు.

తక్కువ నీటితో తక్కువ సమయంలో పండే పంటలను వేయాలన్నారు. అధిక లాభాలను ఆర్జించే పామాయిల్ తోటలను పెట్టాలన్నారు. వర్షభావంతో మహారాష్ట్రలో తాగునీరు సరఫరాకు కొత్త పెట్టారన్నారు. జూలై 10 వరకు వర్షం పడదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. కాళేశ్వరం గోదావరి నీటితో మనం వర్షాభావాన్ని ఎదుర్కోంటున్నామన్నారు. కాలం రాకుండా సిఎం కెసిఆర్ ముందు చూపుతో చేపట్టిన కాళేశ్వరం నీటితో మన చెరువులను నింపుకుంటున్నామన్నారు. మీ గౌరవం పెంచిన దానిని మీరు నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పిటిసి శ్రీహరి గౌడ్, ఎంపిపి శ్రీదేవి చందర్‌రావు, వైస్ ఎంపిపి యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ లక్కరసు ప్రభాకర్ వర్మ, పుల్లూరు గ్రామ సర్పంచ్ నరేశ్ గౌడ్, బండ చర్ల పల్లి సర్పంచ్ దశరథం, ఎంపిటిసి లతా వెంకటేశం, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News